కరోనా పేషేంట్లలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, ఫిజికల్‌గా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా క్లాసులు నిర్వహించాలని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కరోనా రెస్పిరేటరీ సిస్టమ్‌పై దాడి చేస్తుంది కాబట్టి మెరుగైన శ్వాసను తీసుకోవడానికి అనుగుణంగా యోగా క్లాసులను నిర్వహించనున్నారు. వ్యాధినిరోదక శక్తిని పెంచే యోగాసనాలు, ప్రాణాయామం వంటి వాటికి సంబంధించిన క్లాసులను నిర్వహించనున్నారు. ఢిల్లీకి యోగశాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారికోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటే యోగా ఒక్కటే పరిష్కారమని, ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయంలో గంటపాటు యోగా క్లాసులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్చువల్ విధానంలో ఈ యోగా క్లాసులు నిర్వహించనున్నారు. యోగాసనాలు, ప్రాణాయామం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Read: రైలు పట్టాలపై కూలిన విమానం… ఎదురుగా దూసుకొచ్చిన రైలు…ఆ తరువాత…