స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కు సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఆమె కిట్టిలో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోంది. మరోవైపు నిర్మాణ దశల్లో ఉన్న ప్రాజెక్టులలో నేచురల్ స్టార్ నాని ‘దసరా’తో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. ‘భోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ పారితోషికం చర్చనీయాంశంగా మారింది. భారీగా పారితోషికాన్ని పెంచేసిందని…
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో ‘అన్నాత్తే’ అనే యాక్షన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగులో “పెద్దన్న” ఆమె టైటిల్ తో విడుదల కానుంది. అటు కోలీవుడ్ ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ లో రజినీ ఫాలోవర్స్ కూడా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘అన్నాత్తే’ 4 నవంబర్ 2021 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. వినాయక చవితి సందర్భంగా మోషన్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు రికార్డుల జాబితాలో…
యంగ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. మ్యూజిక్ కంపోజర్ తమన్ ఆదివారం రాత్రి ట్విట్టర్లో కొత్త అప్డేట్ ఇచ్చి మహేష్ బాబు అభిమానులందరినీ థ్రిల్ చేశాడు. Read Also : హాట్ సీట్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు… ఎన్టీఆర్ ప్లాన్ సూపర్ ఈ యంగ్ మ్యూజిక్…
ట్యాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ నటి కీర్తి సురేష్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక సందర్భంగా ఆమెకు ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా బర్త్ డే విషెస్ అందుతున్నాయి. తాజాగా ఆమె ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంక్రాంతి ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. డెనిమ్ జాకెట్, రంగు రంగుల టాప్ ధరించిన కీర్తి చూడడానికి చాలా అందంగా, స్టైలిష్ గా ఉంది. యంగ్ బ్యూటీ కీర్తి తాజా…
(అక్టోబర్ 17న కీర్తి సురేశ్ పుట్టినరోజు)నవతరం నాయిక కీర్తి సురేశ్ పేరు వినగానే ‘మహానటి’ ముందుగా గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా రంగంలోనే పలు వెలుగులు విరజిమ్మిన కీర్తి సురేశ్ కీర్తి కిరీటంలో ‘మహానటి’ చిత్రం ఓ మేలిమి రత్నంగా వెలసింది. జాతీయ స్థాయిలో కీర్తి సురేశ్ ను ఉత్తమనటిగా నిలిపిన ‘మహానటి’ని జనం మరచిపోలేరు. ఆ సినిమా తరువాత నుంచీ సంప్రదాయబద్ధంగా సాగుతోంది కీర్తి. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు.…
నేచురల్ స్టార్ నాని ఇటీవలే ‘టక్ జగదీష్’గా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఖాతాలో ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా నాని మరో కొత్త చిత్రానికి సిద్ధమైపోయాడు. విభిన్న పాత్రలతో, విభిన్న శైలిలో ప్రయోగాలు చేస్తున్నారు. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు. ‘దసరా’లో నాని ఫస్ట్ లుక్ రస్టిక్ గా…
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ “సర్కారు వారి పాట” కోసం విదేశాలకు వెళ్ళింది. “సర్కారు వారి పాట” సామాజిక సందేశంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. తాజా షెడ్యూల్ ను స్పెయిన్ లోని బార్సిలోనాలో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతోంది. అద్భుతమైన యూరోపియన్ దేశంలో యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్‌ని యూనిట్ చిత్రీకరిస్తోంది. ఒకవైపు సినిమా చిత్రీకరణ జరుగుతుంటే మరోవైపు సినిమాపై…
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో కీర్తి సురేష్ ఒకరు. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూస్తుంటే కీర్తి ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు వచ్చినట్టు కన్పిస్తోంది. ఎర్రని చీరలో కీర్తి సురేష్ క్లాసిక్ ఎథెనిక్ లుక్ లో మెరిసి చర్చనీయాంశంగా మారింది. ఈ చీరలో ప్రకాశవంతమైన చిరునవ్వుతో మెరిసిపోతుంది. ఆమె గోల్డెన్ బోర్డర్‌తో ఎరుపు రంగు చీరలో చాలా అందంగా…