“సర్కారు వారి పాట”లో కీర్తి సరిగమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తున్న తాజా కమర్షియల్ డ్రామా ‘సర్కారు వారి పాట’లో తన పాత్రతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. కీర్తి సురేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి తన సొంత ట్యాలెంట్ ను బయట పెట్టబోతోంది. వెండితెరపై సరిగమలు పలికించి ప్రేక్షకులను అలరించబోతోందట. కీర్తి సురేష్ ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు, వయోలిన్ ను అద్భుతంగా వాయించే సంగీత విద్వాంసురాలు కూడా. కీర్తి వయోలిన్‌ను అందంగా వాయించి అభిమానులను ఆకర్షించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కీర్తి ‘సర్కారు వారి పాట’ కోసం వయోలిన్ వాయిస్తున్నట్లు సమాచారం.
Read Also : “పుష్ప” స్పెషల్ ఈవెంట్ కు స్పెషల్ ప్లాన్స్
Also Read
‘సర్కారు వారి పాట’కి సంగీత స్వరకర్త అయిన థమన్ ఈ చిత్రంలో కీర్తి సురేష్ సంగీతంతో మ్యూజిక్ సర్ప్రైజ్ ఇస్తుంది అంటూ హింట్ ఇచ్చారు. ఆయన అభిమానుల్లో ఒకరు సోషల్ మీడియా వేదికగా కీర్తి సురేష్ తో సినిమాలో పాట పాడించడం గురించైనా అడగ్గా… కీర్తి సురేష్ దానికి తిరస్కరించిందని, కానీ ఆమె ఖచ్చితంగా వయోలిన్ వాయిస్తారు అని చెప్పుకొచ్చాడు. దీంతో కీర్తి సురేష్ వయోలిన్ వాయించడంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కీర్తి సురేష్ సంగీత ప్రతిభను ప్రమోషనల్ సాంగ్స్ లేదా మ్యూజికల్ బిట్ కోసం థమన్ ఉపయోగించనున్నారు అంటున్నారు. ‘సర్కారు వారి పాట’కు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?