మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలవనుంది. “సర్కారు వారి పాట” చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా యూనిట్ కీలకమైన బార్సిలోనా షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ 3 వారాల సుదీర్ఘ షెడ్యూల్‌లో టీమ్ సినిమాలోని పలు ముఖ్యమైన టాకీ సన్నివేశాలను, మహేష్, కీర్తి మధ్య వచ్చే ఒక పాటను రూపొందించింది. ఒకటి రెండు రోజుల్లో “సర్కారు వారి పాట” టీమ్ హైదరాబాద్‌కు తిరిగి రానుంది.
చిన్న విరామం తర్వాత నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం నవంబర్‌లో చివరి వారంలో పూర్తవుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ జరుగుతుండగా డిసెంబర్ లో పూర్తి స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది మూవీ. పరుశురామ్ దర్శకత్వం వహించిన “సర్కారు వారి పాట” చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మించనున్నారు. జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు.
Read Also : ‘వరుడు కావలెను” వేదికపై ‘అల వైకుంఠపురములో’ జ్ఞాపకాలు