చిత్రపరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలను అనుభవిస్తున్నాను. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం మరికొద్ది రోజుల్లో రానుంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకదాని తరువాత ఒకటి సంక్రాంతి నుంచి పండగ మొదలవుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అభిమానులు ఖుషి అయ్యే న్యూస్ చెప్పాడు. గత…
బుల్లితెరపై అందాల విందు చేసే యాంకర్లల్లో రష్మీ పేరు గట్టిగానే వినిపిస్తోంటుంది.ఒకపక్క షోలలో మెరుస్తూనే మరోపక్క సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా…
మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’. మలయాళ దర్శకుడు దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంతోమంది అగ్రతారలు నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్, సిద్ధిఖ్, సురేశ్ కృష్ణ , ప్రణయ్ మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా…
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలోనూ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన రెండు సినిమాలు ‘పెంగ్విన్, మిస్ ఇండియా’ ఓటీటీలో విడుదల అయ్యాయి. థియేట్రికల్ రిలీజ్ కాకపోవడంతో అవి ఏ మేరకు కలెక్షన్లు వసూలు చేశాయనే విషయం చెప్పలేం. అయితే నిర్మాతలు మాత్రం మంచి లాభానికే ఓటీటీ సంస్థలకు ఆ చిత్రాలను అమ్మారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… ఈ యేడాది మార్చిలో విడుదలైన ‘జాతి రత్నాలు’ చిత్రంలో కీర్తి సురేశ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రంలో ఆయన చెల్లిగా కీలక పాత్ర పోషించింది జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్. ఆ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కాగా, ఆమె టైటిల్ రోల్ పోషించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం 26న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సుధీర్…
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ మొదటి రోజు షూటింగ్ స్టార్ట్ అయిందన్న విషయాన్నీ తెలియజేస్తూ దర్శకుడు ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. చిరంజీవి ఎంతగానో ఎదురుచూస్తున్న “భోళా శంకర్” షూటింగ్ ఈరోజు ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తొలిరోజు షూటింగ్కు ముందు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ ను పంచుకున్నారు. Read Also : రియల్ చినతల్లికి…
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 15 కోట్ల “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్…
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ‘మహానటి’తో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైంది. ఆ తరువాత చాలా వరకు గ్లామర్ పాత్రలను దూరం పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. కేవలం కంటెంట్ బేస్డ్, లేడీ ఓరియెంటెడ్ లేదా తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలను ఒప్పుకోవడం లేదు. ‘మహానటి’తో వచ్చిన ఫేమ్ ను అలాగే కంటిన్యూ చేయాలనుకుంటోంది. అయితే దాని కోసం సోదరి పాత్రలకు కూడా ఓకే చెప్పడానికి వెనకాడడం లేదు. సీనియర్ హీరోలకు…