కీర్తి సురేష్ రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, వేడుకకు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక దిల్ రాజుతో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
Read Also : జైజై చరణ్… జైజై చరణ్… మెగా ఫ్యాన్స్ తో కలిసి ‘సఖి’ సందడి
“గుడ్ లక్ సఖి” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ రామ్ చరణ్ అభిమానుల కోసం ఒక ఉత్తేజకరమైన అప్‌డేట్‌ను పంచుకున్నారు . “రామ్ చరణ్ అభిమానులకు పండగే పండగ. రాబోయే 12 నెలల్లో రామ్ చరణ్ మూడు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘ఆర్‌సి 15’… చరణ్ సినిమాలో నుండి కొన్ని హై ఆక్టేన్ యాక్షన్ కోసం సిద్ధంగా ఉండండి” అని దిల్ రాజు అన్నారు.
కాగా ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ 28న, ‘ఆచార్య’ సంవత్సరం చివరి భాగంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ఆర్‌సి 15’ విషయానికొస్తే… ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.