నిన్న సాయంత్రం “గుడ్ లక్ సఖి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కావలసిన అనారోగ్యం కారణంగా చిరంజీవి రాలేకపోయారు. ఆయన స్థానంలో రామ్ చరణ్ ఈ వేదికను అలంకరించారు. రామ్ చరణ్ ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకనిర్మాతలను అభినందించారు. ఇక ఈ సినిమాకు చాలా మంది జాతీయ అవార్డు గ్రహీతలు పని చేశారు. కాబట్టి దీనిని చిన్న సినిమా అని పిలవవద్దని అన్నారు.
Read Also : నేను చిరంజీవి మెసెంజర్… : చరణ్
‘మహానటి’ చూసిన తర్వాత కీర్తి సురేష్ కి అభిమానిని అయ్యానని వెల్లడించారు. ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్న చెర్రీ… కీర్తితో కలిసి స్టేజ్ పై ‘నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.