మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గుడ్ లక్ సఖి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తోంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను రేకెత్తించాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సమయమంలో ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. జనవరి 28 న ప్రపంచ వ్యాప్తంగా గుడ్ లక్ సఖి రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అంతేహాకాకుండా రిలీజ్ పోస్టర్ ని కూడా షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. మరి ఇన్నిరోజులు వాయిదా పడుకుంటూ వస్తున్న ఈ సినిమా థియేటర్లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.