కీర్తి సురేష్ స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు నగేష్ కుకునూర్. సుధీర్ చంద్ర నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకి సెన్సేషనల్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని హోటల్ పార్క్ హయత్‌లో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా, ఈ వేడుకకు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Read Also : “సఖి”తో చరణ్ ‘నాటు’ స్టెప్పులు… కీర్తికి ఎప్పుడో ఫిదా
ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ‘మహానటి’ సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రానికి సంతకం చేశానని తెలిపారు. దర్శకుడు నగేష్ కుకునూర్‌కి కృతజ్ఞతలు తెలిపిన నటి, సినిమా షూటింగ్ సమయంలో అతని నుండి చాలా నేర్చుకున్నానని వెల్లడించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆదిని గోల్డ్ రాజు అని పిలుస్తారని కీర్తి వ్యాఖ్యానించింది. అందాల సుందరి జగపతి బాబును అద్భుతమైన సహనటుడిగా పేర్కొంది. సినిమా కోసం కష్టపడిన ప్రతి టెక్నీషియన్‌కి కృతజ్ఞతలు తెలిపింది కీర్తి.
రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఈ ఈవెంట్‌కు హాజరైనందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. తనతో కలిసి డ్యాన్స్ చేయమని కోరింది. అంతేకాకుండా థియేటర్లలో సినిమా చూసి హిట్ చేయాలని అభిమానులను కోరింది.