Srikanta Chari Mother: బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాక్యలు చేశారు.
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే..అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలసారి స్వగ్రామం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు.
Ponnam Prabhakar: కాంగ్రెస్ వస్తే..కరువు వస్తుందని అనడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వ్యవసాయ డిగ్రీ కళశాల భవనానికి మంత్రి పొన్నం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ..
పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బీస్ ప్రకటించారు. ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థులను ప్రకటించారు.
Enugala Peddireddy: బీఆర్ఎస్ కు ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. పార్టీ వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గౌరవనీయులైన భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నానని లేఖ రాశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్ల పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేరును ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు.
ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, ముఖ్యమంత్రి భాషపైన నిన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ వరంగల్ నియోజకర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.