అనంతపురం అర్బన్ టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేసారు.
ప్రజలందరూ కేసీఆర్‌కు అండగా కడియంను గెలిపిస్తే అందరినీ మోసం చేసిండు
ధర్మసాగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కేసీఆర్ కు అండగా కడియం ను గెలిపిస్తే అందరినీ మోసం చేసిండని ఆయన మండిపడ్డారు. డబ్బులకు లొంగి , పదవుల పేరుతో బిఆర్ఎస్ కు , తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదకారిగా కడియం తయారయ్యాడని పల్లా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో , మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ నేనే గొప్ప అని చెబుతూ అహంకారంతో అందరినీ మోసం చేస్తున్నాడని, వ్యక్తిగతంగా మాదిగలకు ఏం చేసిన వ్యక్తి కడియం కాదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆనాడు ఎన్టీఆర్ కు , ఈరోజు కెసిఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అని, ప్రజలు చి కొడుతారు . నోట్లో ఉమ్మి వేసి , చెప్పులతో కొడతారన్నారు. ముసలి వయసులో , ముసలి నక్క లాగా మా ప్రాంత ప్రజలను మోసం చేసినవని, నీకు సిగ్గు శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్ అని ఆయన డిమాండ్ చేశారు.
పేదల పట్ల ఎప్పుడూ చంద్రబాబుకు ప్రేమ లేదు..
చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. టిప్పర్ డ్రైవర్ అని, వేలిముద్ర గాడు అని చంద్రబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శింగనమల అభ్యర్థిని అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వ్యక్తి అసెంబ్లీకి వస్తారని, చంద్ర బాబుకు ఎదురవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదల పట్ల ఎప్పుడూ చంద్ర బాబుకు ప్రేమ లేదన్నారు. డబ్బులు ఉన్న వాళ్లకే బాబు టికెట్లు ఇచ్చారన్నారు. వేలిముద్ర గాళ్లు అని చంద్రబాబు అంటున్నారని ఆయన ఆగ్రహానికి గురయ్యారు చంద్రబాబు నాయుడు డ్రైవర్ ఎందుకు చనిపోయారు ? ఇప్పటి వరకు ఎందుకు సమాధానం చెప్పలేదంటూ ప్రశ్నించారు. 420 అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చంద్ర బాబు అని వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును పాతాళంలోకి జనం తొక్కుతారన్నారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్.
ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించిన గొప్ప రోజు ఇది..
వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ అన్ స్థాపబుల్ అని.. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు జాతికి ఈ రోజు ఎంతో గొప్పరోజు అన్న ఆయన.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వచ్చానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడు అని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఆయన విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. డీఎస్సీని పూర్తిగా ఇవ్వలేదన్న ఆయన.. ఐదేళ్లలో అందరూ నష్టపోయారన్నారు.
ప్రభుత్వం మారితే వారిపై చర్యలు, ఇదే నా హామీ.. రాహుల్ గాంధీ హెచ్చరిక..
బీజేపీ నేతలకు పరోక్షంగా హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ రూ. 1800 కోట్లు ఫైన్ కట్టాలని ఇన్‌కమ్ టాక్స్ నోటీసులు అందుకున్న తర్వాత దీనిని ‘‘టాక్స్ టెర్రరిజం’’గా ఆరోపించింది. ‘‘ ప్రభుత్వం మారినప్పుడు, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇలాంటివి మళ్లీ చేసే ధైర్యం ఎవరూ చేయని విధంగా చర్యలు తీసుకుంటాము. ఇది నా హామీ’’ అని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ హెచ్చరించారు.
రైతుబంధు పెంచుతారాని కాంగ్రెస్‌కి ఓటేస్తే ఇవ్వకుండా ముంచారు
రైతుబంధు పెంచుతారాని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవ్వకుండా ముంచారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రఘునందన్ రావు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ మెదక్ ఎంపీగా గెలుస్తాడట అంటూ ఆయన సెటైర్లు వేశారు. బీజేపీ వాళ్లు కవిత, కేజ్రీవాల్ లాంటి ప్రతి పక్షా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, బీజేపీ వాళ్లు దేవుని పేరుతో వస్తున్నారన్నారు. కేసీఆర్ చేసినన్ని యాగాలు, పూజలు దేశంలో ఎవరు చేయలేదన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో అభివృద్ధిని సీఎం రేవంత్ అడ్డుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు. సీఎం వెటర్నరీ కాలేజీని కొండంగల్ కి తరలించారన్నారు. శిల్పారామం, డబుల్ రోడ్డు పనులను మధ్యలోనే అడ్డుకొని నిధులను కొడంగల్ కు తరలిస్తున్నారని చెప్పారు. కొడంగల్ కు ఏమైనా తీసుకుపో తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్న హరీష్ .. సిద్దిపేటకు వచ్చినవి తీసుకపోతే మాత్రం చూస్తూ ఉరుకొమన్నారు. రేపు సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతు చేస్తారని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ కి సిద్దిపేటపై ఇంత పగ,కక్ష్య ఎందుకని హరీష్ ప్రశ్నించారు.
ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ సభ.. భారీగా తరలివచ్చిన జనం
కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర 3వ రోజుకు చేరుకుంది. ఎమ్మిగనూరులో భారీగా నిర్వహిస్తోన్న ‘మేమంతా సిద్ధం’ సభకు.. లక్షలాదిగా జనం తరలివచ్చారు. నేడు దిగ్విజయంగా సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగింది. గూడూరు మండలం పెంచికలపాడు నుంచి కొత్తూరు, పాలకుర్తి మీదుగా కోడుమూరుకు.. కోడుమూరు నుంచి వర్కురు, వేముగొడు, పుట్టపాశం, హెచ్ కైరవాడి, గోనెగండ్ల, రాల్లదొడ్డి వరకు బస్సు యాత్ర సాగింది. రాల్లదొడ్డి శివారులో భోజన విరామం తీసుకున్నారు. అనంతరం ఎర్రకోట మీదుగా ఎమ్మిగనూరుకు బస్సుయాత్ర చేరింది. ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభకు చేరుకున్న సీఎం జగన్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈలలు,కేకలతో అభిమానులు స్వాగతం పలికారు. గంటల కొద్ది మండుటెండలో నిల్చోని కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు. కార్యకర్తలకు, నాయకులకు చేతులు జోడించి సీఎం అభివాదం చేశారు.
విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా?
ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ అన్నారు. తన కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉందని.. వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోందన్నారు. ఎమ్మిగనూరులో ‘మేమంతా సిద్ధం’ భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. పెత్తందార్లను ఓడించడానికి తాను సిద్ధంగా ఉన్నానని.. మీరు సిద్ధమా అంటూ ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ అన్నారు. 58 నెలల పరిపాలనలో జరిగిన మంచిని, మార్పును గమనించమని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నామన్నారు. మీరంతా కూడా ప్రతీ ఇంటికి వెళ్లి ఈ మార్పులు గురించి చెప్పాలని కోరుతున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు జరిగాయన్నారు.
రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో పడింది
రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసాయరంగం సంక్షోభంలో పడిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గురువారంనాడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. జిల్లాలోని తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి, సింగారంలో ఎండిపోయిన వరి పంటలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు గాదరి కిషోర్‌తో కలిసి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం, కోనసీమలో ఎక్కడ చూసినా పచ్చని వ్యవసాయ పొలాలు, పచ్చని పచ్చిక బయళ్లే కనిపించాయని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సూర్యాపేట జిల్లా ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ ఆయకట్టులో వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే సీన్ పూర్తిగా మారిపోయింది.
యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత వీరాంజనేయులు
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బపులపాడు మండలం కానుమొలు గ్రామంలో బీరయ్య స్వామి , కామరవతి అమ్మవార్ల గుడి ప్రతిష్ట కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం హనుమాన్ జంక్షన్ పార్టీ కార్యాలయంలో రామన్న గూడెం సర్పంచ్ రెడ్డి వీరాంజనేయులు వైసీపీ పార్టీని వీడి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో టీడీపీలో చేరారు. యార్లగడ్డ వెంకట్రావు ఆయనకు టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు, యార్లగడ్డ అభిమానులు పాల్గొన్నారు. అంతకు ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన యార్లగడ్డ వెంకట్రావుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
మహిళల రిజర్వేషన్‌పై రాహుల్ కీలక ప్రకటన
సార్వత్రిక ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. ఈ మేరకు మహిళలకు రాహుల్ హామీ ఇచ్చారు. ఇప్పటికే మేనిఫెస్టోలో భాగంగా మహిళలపై అనేక వరాలు కురిపించారు. ఈసారి ఎన్నికల్లో మహిళలే లక్ష్యంగా పథకాలు రూపొందిస్తున్నారు. శక్తిమంతమైన మహిళలు దేశ భవితవ్యాన్ని మారుస్తారని రాహుల్ వ్యాఖ్యానించారు.
పని చేసే వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రతి 10 మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒకరు మాత్రమే స్త్రీలు ఉన్నారని చెప్పారు. భారతదేశంలో మహిళల జనాభా 50 శాతం ఉన్నప్పటికీ హయ్యర్ సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించలేరా అని రాహుల్ ప్రశ్నించారు.
పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందట..!
పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టింది..గతంలో తనను కేసీఆర్ కోడితే .. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి కొట్టినట్లుగా పరిస్థితి మారిందని.. మరలా తన జోలికి వచ్చిన.. ఎగిరేగిరి పడిన వారిని అదే గతి తప్పదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సీటు ఆశించి బంగపడ్డ మల్క కోంరయ్య కుటుంబన్ని ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు.. ఇన్నాళ్లు గా పార్టీని బలోపేతం చేయడానికి వారు చేసిన వర్క్ ను అభినందించడంతో పాటు తనకు పూర్తి సహాకరం అందించలంటూ కోరారు.. కాంగ్రెస్ మంత్రులు తమతో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నరంటూ చెప్పడం నవ్వు తెప్పిస్తుందని.. అలా ఐతే తమ కు టచ్ లో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నరంటూ బాంబు పేల్చినంత పనిచేశారు ఈటల రాజేందర్.. తమను కొట్టేవారే లేరని ప్రభుత్వలు అనవసర ఆలోచనలు చేస్తున్నయాని.. కానీ వారు చేసే పనులకు భవిష్యత్ లో పరిణమాలు ఇలానే ఉంటయంటూ.. కేసిఆర్, రేవంత్ రెడ్డి లకు ఝలక్ ఇచ్చినంత పనిచేశారు ఈటల రాజేందర్.