విపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కి పొలంబాట పట్టాలని అర్థమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనం బాట మరిచిన కేసిఆర్ కు ప్రజల అజెండా ఏంటో తెలియడంలేదన్నారు. అధికారం కోల్పోయిన మూడు నెలలకే రాజకీయంగా పతనమైన తర్వాత కేసిఆర్ జనంలోకి రావాలనుకోవడం విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్ల తర్వాత కేసిఆర్ కు ప్రజలు గుర్తుకు వచ్చారని, అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులు పడ్డ సమయంలో పట్టించుకోని కేసిఆర్, ఒడిపోగానే పర్యటనలు చేస్తున్నారన్నారు అద్దంకి దయాకర్. అసెంబ్లీకి రాని కేసిఆర్ వచ్చే ఎన్నికల్లో నష్టపోతామని రాజకీయ లబ్ది కోసం పొలం బాట పట్టారని, నాడు పండిన పంటలు కొనకపోతే రోడ్ల మీద మొలకెత్తిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు.
Pakistan: ‘రెడ్ కార్పెట్’లపై నిషేధం.. ఖర్చులని తగ్గించుకోవాలని పాక్ నిర్ణయం..
అంతేకాకుండా..’ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తున్నారు… కేసిఆర్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు… ఇప్పటికైనా బాద్యాతాయుతమైన ప్రతి పక్ష నేత గా కేసిఆర్ నడుచుకుంటే బాగుంటుంది… కేసీఆర్ సర్కార్ కట్టిన ప్రాజెక్టుల డొల్ల తనమే ఇప్పుడు రైతుల గోసకు కారణమైంది… ఫ్రీ కరెంట్ అంటూ కరెంట్ ను అమ్ముకొని రైతులను కేసిఆర్ మోసం చేసిండు… ప్రతి 20 ఏళ్ల కొక సారి దక్షిణ భారత దేశంలో నీటి ఎద్దటి పరిస్థితులు వస్తున్నయి… కర్ణాటకలో కన్నీళ్లు మింగే పరిస్థితి ఉంటోంది..కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి రాలేదు… ఇవేమీ తెలియనట్లు బీఆర్ ఎస్ గగ్గోలు పెడుతుంది… తెలంగాణ అస్తిత్వాన్ని వదిలేసి BRS ను ఏర్పాటు చేసిన కేసిఆర్ ను అప్పుడే ప్రజలు మరిచిపోయారు… కేసిఆర్ మొసలి కన్నీళ్లు పెట్టినా ఎవ్వరు పట్టించుకోరు… రైతులను, ప్రజలను ఆదుకునే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.’ అని అద్దంకి దయాకర్ రావు అన్నారు.
MK Stalin: బీజేపీలో 261 మంది రౌడీలు ఉన్నారు.. ప్రధాని మోడీపై స్టాలిన్ ఆరోపణ..