Gutha Sukender Reddy : పెహల్గం ఘటన తర్వాత దేశ ప్రజల అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. యుద్ధం కంటే ఉగ్రవాద నిర్మూలన చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. Gold Rates:…
EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు.
Jagga Reddy: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ పూర్తి చేశారు.. కాంగ్రెస్ చేసిన రుణమాఫీకి.. కేసీఆర్ చేసిన రుణమాఫీకి తేడా ఉందన్నారు.
CM Revanth Reddy : బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభ నిర్వహించారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు…
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మె్ల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. కెసిఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ అంటే జుటా.. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు దేవుడని పొగిడావు.. అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు.. భయ పడ్డావ అంటూ ఎద్దేవా చేశారు.…
Minister Seethakka: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ స్పీచ్ చూసాకా... ఓ నియంత అధికారం పోయాక ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నట్టు ఉంది అని మంత్రి సీతక్క ఎద్దవా చేశారు. బాధ ఎవరి కోసం.. అధికారం పోయిందని బాధ తప్పితే ఇంకేం బాధ అని ప్రశ్నించింది.
Minister Ponguleti: వరంగల్ లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మంచి సూచన ఇస్తారేమో అనుకున్నాం.. కానీ, ఆయన మనసంతా విషం నింపుకున్నాడు అని మండిపడ్డారు.
ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు 11 రూపాయలైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చారా.. కగార్ అనే ఆపరేషన్‌తో ఛత్తీస్‌ఘడ్‌లో యువకులను ఊచకోత కోస్తున్నారు.. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపేయండి.. మావోయిస్టులతో చర్చలు జరపండని కోరారు. Also Read: KCR: కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా.. ఇది సాధ్యమా..? కేసీఆర్ నువ్వు రా…
కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ సరఫరా, రైతు బంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ అయిందన్నారు. కానీ, అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని ఆరోపించారు.
ఎల్కతుర్తిలో జరిగిన సభలో కేసీఆర్ పోలీసులపై సంచన వ్యాఖ్యలు చేశారు. సభకు తరలి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాట్లాడుతూ.. పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు.. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. పోలీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే.. ఇది ఆపడం ఎవరితరం కాదు.. ఇక నుంచి నేను బయలుదేరతా.. ఎవరి లెక్కలు ఏంటో తీద్దాం.. కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం.. కరెంట్ సరఫరా, రైతుబంధు,…