కేసీఆర్ ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. ఇప్పుడు జోకులు కూడా బాగానే చెబుతున్నారు అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. హైదరాబాద్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రైతు బతికినంత వరకు రైతే అన్నారు.. రైతు అంటే నిర్వచనం ఏంటి? అని ప్రశ్నించిన ఆమె.. 66 లక్షల మంది రైతులు ఉంటే 41 లక్షల మంది రైతులకే రైతుభీమా ప్రీమియం ప్రభుత్వం కడుతుందని.. మిగతా 25…
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఇప్పుడు తన ఆరాధ్యుడు నందమూరి తారక రామారావును గుర్తుచేస్తున్నారు. ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించింది. అదే ఏడాది మే 28న తన పుట్టిన రోజు నాడు విజయవాడలో విపక్షాలతో మహా రాజకీయ సదస్సు నిర్వహించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక ఐక్యకూటమి ప్రయత్నాలకు అది మరో ఆరంభం. 1983లోనే కర్నాటకలో రామకృష్ణ హెగ్డే సారధ్యంలో జనతా పార్టీ ప్రభుత్వం…
రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ప్రధానికి.. కోల్ ఇండియాకి ఫిర్యాదు చేశాం. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్ ని సీఎండీగా కొనసాగిస్తున్నారు. 50 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది. ప్రధాని, కోల్ సెక్రెటరీ లకు ఫిర్యాదు చేశాం. కేంద్ర మైనింగ్ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తే..మేము చేసేది ఏమీ లేదు ప్రధాని కార్యాలయం చూసుకుంటుంది అని చెప్పారు. సెంట్రల్…
సర్జికల్ స్ట్రయిక్స్‌కు సాక్ష్యమేదీ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు.. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల…
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. ఈ వ్యవహారంపై ఓ రేంజ్లో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌రెడ్డి.. అస్సాం ముఖ్యమంత్రి డీఎన్ఏ ఎంటి అని అడుగుతామన్న ఆయన… అస్సాం పక్కనే చైనా ఉంది కదా.. అసలు ఆయన డీఎన్ఏ చైనాదా? అస్సాందా? అనేది తేలాలన్నారు. ఇక, మాతృత్వాన్ని అవమానించే మాటలు మాట్లాడారంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మపై ఆగ్రహం వ్యక్తంచేశారు రేవంత్‌రెడ్డి.. భారత్ మాతాకు పుట్టినోల్లా……
సీఎం కేసీఆర్ నేడు జనగామ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జనగామ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అయితే టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభ ప్రజల పాలిట భయానక సభగా మారింది. ఎందుకంటే.. టీఆర్ఎస్ సభతో హైదరాబాద్ వరంగల్ హైవే పైనా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. దారి లేక ప్రాణాపాయ స్థితిలో ఉన్న…
ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై నిన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజు నుండి ఈ నెల 10తేదీ వరకు అంబేద్కర్ విగ్రహల వద్ద నిరసనగా కార్యక్రమాలు చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తో రాజ్యాంగంపై చర్చించేందుకు ఎమ్మార్పీఎస్ సిద్ధంగా ఉందన్నారు. పాలకులు తమ వైఫల్యాలను, రాజ్యాంగంపై ఆపాదించడం సీఎం కేసీఆర్ నిరంకుశత్వానికి…
కేంద్రం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల తీరును కేసీఆర్ తప్పు పట్టారని, కానీ ఐఏఎస్ ఐపీఎస్‌ల వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేసిన చరిత్ర కేసీఆర్‌కే దక్కుతుందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం తప్పేనని ఉత్తమ్ అన్నారు. 14 మంది ఐఏఎస్‌లను తప్పించి.. వేరే రాష్ట్రానికి చెందిన వాళ్లను సీఎస్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.…