ఊసరవెల్లి కేసీఆర్ను ప్రజలు గద్దె దింపాలంటూ విజయశాంతి తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి… కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించారన్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని వడ్ల ముచ్చటను మర్చిపోయేలా చేయడానికే, ఊరూరా రైతుబంధు సంబురాలు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని విజయశాంతి మండిపడ్డారు.…
తెలంగాణ రైతులు మరణిస్తున్న కేసీఆర్కు సోయి లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు మరణిస్తున్నా కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు. Read Also: తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉంది : తమ్మినేని వీరభద్రం…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బండి సంజయ్ కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బంద్ చేయాలంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎరువుల ధరలు…
దేశంలోనే ప్రతిష్టాత్మక పథకాలతో ముందున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలతో పాటు రైతు వేదికల వంటి నిర్మాణాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్ తాజాగా రైతుల కోసం మరో పథకాన్నితీసుకురాబోతున్నట్లు సమాచారం. 47 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ. 2,016 పెన్షన్ ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. 3 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు…
మరోసారి ట్విట్టర్ వేదికగా వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అధికార టీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులు చనిపోతున్న సర్కార్కు పట్టడం లేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముందు ఇంట గెలిచి రచ్చగెలవండంటూ షర్మిల కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్లో ఇంట గెలిచిన తరువాత రచ్చ గెలవండి దొరా. మీకు తమిళనాడు ముఖ్యమంత్రితో మాటామంతికి, కేరళ CM తో మంతనాలు చేయడానికి,బీహార్ ప్రతిపక్ష నేతను కలసి దోస్తానా చేయడానికి,దేశ రాజకీయాల మీద చర్చ…
దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని ఈటల రాజేందర్ అన్నారు. దీనికి కారణం సీఎం కేసీఆరే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ బీజేపీ నిరసన సభలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. ఉద్యోగ వర్గానికి సంఘీభావం కోసం బీజేపీ నేతలను రాష్ట్రానికి వస్తున్నారన్నారు. ప్రభుత్వం విమర్శించే కన్నా ముందుగా మీరు చేయాల్సింది స్థానికత ఆధారంగా ఉద్యోగులను సవరించాలని డిమాండ్ చేశారు. 317 జీవోను రద్దు…
వానపాములా పడకుంటే.. తాచు పాములా సీఎం కేసీఆర్ కాటేస్తున్నాడని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. G.O.317-సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య పంచాయితీ పెట్టిందని వైఎస్ షర్మిల అన్నారు. భార్యా భర్తలను విడదీసిందని… .9 మందికి పైగా ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకొందని సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా దొర తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు ఉందని.. G.O.ను మాత్రం రద్దు చేయడం లేదని ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు.…
రైతులకు కేసీఆర్ చేసిందేమి లేదని బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు బీజేపీ సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ , సీపీఎం, సీపీఐ పార్టీలు వేర్వేరు కాదన్నారు. అన్ని…
రెండు ఏళ్ల తర్వాత మీరు కోరుకున్న బీజేపీ ప్రభుత్వం వస్తే జీవో 317 లో బొంద పెడతాం అని బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు మద్దతుగా వరంగల్ సభలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ను అరెస్టు చేస్తే బీజేపీ కార్యకర్తలు భయపడిపోతారని ముఖ్యమంత్రి అనుకున్నారని, కానీ బీజేపీ కార్యకర్తలు భయపడరని బండి సంజయ్ అన్నారు. మాకు జైలు కొత్త కాదు ఇప్పటికి ఎనిమిది సార్లు వెళ్లాం. రాష్ట్ర…
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్లోని తన కార్యాలయంలో పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ పై నిప్పులు చెరిగారు.కేసీఆర్కు చేతనైందల్లా గలీజు తిట్లు.. గారడీ మాటలేనన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారని షర్మిల అన్నారు.…