Bandi Sanjay released from jail: Tspsc స్కామ్ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన సంజయ్ ప్రభుత్వం ముందు 3 పాయింట్లు పెట్టారు. 1. Tspsc స్కామ్ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి. 2. కేటీఆర్ ని భర్తరఫ్ చేయాలి. 3. టీఆఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌తో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపియాల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ కుటుంబం లిక్కర్ కుటుంబం, లీకుల కుటుంబం అంటూ మండిపడ్డారు. 30 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయమని, పేపర్ లీక్ అంటున్నారు… ఫోన్ పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్ళింది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సీపీ నువ్ చెప్పింది నిజం అని నీ టోపి పై ప్రమాణం చెయ్.. అమర వీరుల పై ప్రమాణం చెయ్.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారు? వరంగల్ లో tspsc ఇష్యుపై… నిరుద్యోగులతో భారీ నిరసన చేస్తామని మండిపడ్డారు. ఎవరో పేపర్ షేర్ చేస్తే నాకు సంబందం ఏంటి? లీకు కు… మాల్ ప్రాక్టీస్ కి తేడా తెలియదు సీపీ కి అంటూ నిప్పులు చెరిగారు.
Read also: Bholaa: అందుకే అన్నింట్లో వేలు పెట్టకూడదు అంటారు…
సీపీకి సంబందించిన అన్ని అంశాలను బయటకు తెస్తాం… నల్గొండ విజయవాడ ఖమ్మంలలో ఏమేం చేశారో అన్నీ తెస్తాం… భారీ ఆస్తులు సంపాదించారని ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరు అధికారులు తీరు వల్ల కింది స్థాయి సిబ్బంది ఎందుకు కొలువు చేస్తున్నాం అని బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ పేపర్ ఎవర్ లీక్ చేస్తారు… 21 మార్కులు పాస్ అయ్యేది అంటూ వ్యంగాస్ర్తం వేశారు. ఒకాయినే అగ్గి పెట్టే దొరకని మంత్రి… నా మీద పిడీ యాక్ట్ పెట్టాలంటున్నాడు అంటూ మండి పడ్డారు. ఆయన అగ్గిపెట్టి అంశంపై అంతర్జాతీయ విచారణ జరపాలని ఎద్దేవ చేశారు. నీ బిడ్డ జైలుకు పోతాది… నీ కొడుక్కు కూడా ముహూర్తం సిద్ధం చేశామని సంచలన వ్యాఖ్యలు చేశారు. లవంగానికి తంబకు కు తేడా తెలియని మూర్ఖుడు నీ కొడుకు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను పిచ్చోని చేతిలో రాయి అంటున్నారు అని మండిపడ్డారు. దళిత బంధు పై, రుణమాఫీ పై.. tspsc అంశం పై, ప్రశ్నిస్తే పిచ్చి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ ఫోన్ అడుగుతున్నారు… సెల్ ఫోన్ తో పనేంటి అని ప్రశ్నించారు. సీపీ నన్ను కుట్రదారు అంటున్నారు.. టోపి పై ప్రమాణం చెయ్… లేదంటే నువ్ ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగేవాడివి అంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి 30 లక్షల పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు సీఎం గారు అంటూ ఎద్దేవ చేశారు. నా పిల్లల మీద నమ్ముకున్న దేవునిపై నేను ప్రమాణం చేసి చెబుతున్న నాకు సంబంధం లేదని అన్నారు. నా ఇంటికి వచ్చి దాడి చేసిన విషయంపై ప్రివిలేజ్ కమిటీ కి ఫిర్యాదు చేస్తామన్నారు. వరంగల్ సీపీ సహా అధికారులపై కంటెంప్ట్ వేస్తామన్నారు. ఇప్పుడు సీఎంని కాపాడమని అడగండి, కరీంనగర్, వరంగల్ సీపీ లపై కంప్లైంట్ చేస్తామని సీపీలపై బండిసంజయ్ నిప్పులు చెరిగారు.
Bholaa: అందుకే అన్నింట్లో వేలు పెట్టకూడదు అంటారు…