Tspsc స్కామ్ పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జైలు నుంచి బయటకు అడుగుపెట్టిన సంజయ్ ప్రభుత్వం ముందు 3 పాయింట్లు పెట్టారు.
తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల దళిత మేధావులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నారు.
కేటీఆర్ పై కుట్రలు చేస్తున్నారు.. ప్రతిపక్షాల చర్యలు సరిగా లేవని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో నియంత పాలన సాగుతుందని అన్నారు.
సీఎం కేసీఆర్ నేడు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగళ్ల వానతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కంటి వెలుగు, సాగునీటిరంగ అద్భుత ప్రగతిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు అరవింద్ కేజ్రీవాల్.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Minister KTR: అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెన్నంటే ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ సూచించారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్షల పేపర్ లీకేజీని నిరసిస్తూ ఓయూ జేఏసీ, ఎన్ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో జరిగిన నిరసన దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.