తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ పరిస్థితి ఉప్పూ నిప్పులా ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజసంగ్రామ యాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రావడం ఆ పార్టీలో జోష్ మరింతగా పెంచింది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు…
ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో టీఆర్‌ఎస్ నేతలు భేటీ కానున్నారు. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి ఎంపీ నామా నాగేశ్వర్‌రావు లు ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే ఈ భేటీలో తెలంగాన నుంచి ప్రతి సంవత్సరం ఎంత ధాన్యాన్ని ఏ రూపంలో కొనుగోలు చేస్తారో.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని టీఆర్‌ఎస్…
ఢిల్లీ పర్యటనలో స్పెషల్ మిషన్‌పైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్‌లో పలుమార్లు కేంద్రం చెప్పినా.. ఆయన ఫోకస్ ఆ అంశంపైనే ఉందా? తాజా హస్తిన టూర్‌లోనూ ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారా? మరి.. త్వరలో క్లారిటీ వస్తుందా? ఇంతకీ ఏంటా అంశం? నియోజకవర్గాల పెంపు ఢిల్లీ టూర్‌లో ప్రస్తావించారా? పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలి. ఇదే…
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఈ నెల ఆరంభంలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. హస్తినలో టీఆర్‌ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తదితరులను కలిశారు.. ఓవైపు రాష్ట్ర సమస్యలపై చర్చిస్తూనే.. మరోవైపు.. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి…
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చావోరావో అన్నట్లుగా మారింది. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే నడుస్తోందని భావించినా అనుహ్యంగా కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ కేవలం సెకండ్ ప్లేస్ కోసమే పోటీ పడుతుండగా టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హూజురాబాద్ వేదికగా ఈ రెండు పార్టీలు పొలికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీని ప్రస్తుతం…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. హస్తినలో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఈ నెల 1వ తేదీన ఢిల్లీ వెళ్లిన ఆయన.. మరుసటి రోజు టీఆర్‌ఎస్ కార్యాలయానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు.. ఇక, మరుసటి రోజు.. ప్రధాని మోడీని, ఆ తర్వాత అమిత్‌షాను.. ఇవాళ కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర షెకావత్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. రేపు కూడా హస్తినలోనే ఉండనున్నారు సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఆరు…
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయని అంటుంటారు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు గమనిస్తే అది నిజమే అని ఎవరైనా అంగీకరిస్తారు. తాజాగా.. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తున్న కేసీఆర్ తీరు.. సైతం ఈ చర్చలో ముందుకు వస్తోంది. ఇదంతా.. భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా భావించవచ్చా.. అన్న ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి. ఇందుకు రకరకాల కారణాలను రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి రోజు రోజుకూ బలం పెరుగుతున్నాకొద్దీ..…