కేరళ మినీ పాకిస్థాన్ అంటూ మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. విపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. నితీష్ రాణేపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక నితీష్ రాణే వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు.
ఇది కూడా చదవండి: Xi Jinping: “ఎవరూ ఆపలేరు”.. న్యూఇయర్ సందేశంలో తైవాన్‌కి చైనా వార్నింగ్..
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్ స్పందించారు. బీజేపీ ద్వేషపూరిత వ్యక్తులను రంగంలోకి దింపుతోందని ఆరోపించారు. విభజన పూరిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి నితీష్ రాణేపై ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేరళపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. కేరళ ప్రజల పట్ల బీజేపీ లోతైన శత్రుత్వం ఏదో ఉందని తెలుస్తుందన్నారు.
ఇది కూడా చదవండి: Russia-Ukrain: న్యూఇయర్ వేళ ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడులు
నారాయణ్ రాణే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ప్రస్తుతం కేంద్రమంత్రిగా పని చేస్తున్నారు. ఈయన కుమారుడే నితీష్ రాణే. మీడియాతో మాట్లాడుతూ.. కేరళపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేరళ మినీ పాకిస్థాన్ కాబట్టే.. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ గెలిచారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులంతా గాంధీ కుటుంబానికి ఓటేశారన్నారు. ఉగ్రవాదులందరినీ కేరళ తీసుకెళ్లారని.. అందుకే వారంతా ఎంపీలు అయ్యారని రాణే వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కేరళలో మత మార్పిడి, లవ్ జిహాద్ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: November 2024 Movie Roundup:సుబ్బరాజు పెళ్లి, అక్కినేని అఖిల్ నిశ్చితార్థం, రెహమాన్ విడాకులు