Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంతిమయాత్రపై కాంగ్రెస్ కీలక ప్రకటన
- మన్మోహన్ సింగ్ అంతిమయాత్రపై కాంగ్రెస్ కీలక ప్రకటన
- శనివారం ఉదయం 9:30 గంటలకు ఏఐసీసీ నుంచి ప్రారంభం
- అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించనున్న కేంద్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో వయో భారంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులంతా సంతాపం తెలిపారు. ఆర్థిక వేత్తగా మన్మోహన్ అనుసరించిన విధానాలను నేతలు గుర్తుచేసుకున్నారు. అంతేకాకుండా ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ప్రముఖులు నివాళులర్పించారు.
ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. ఇదిలా ఉంటే మన్మోహన్ అంత్యక్రియలపై కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాల్ కీలక ప్రకటన చేశారు. మన్మోహన్ అంత్యక్రియలు శనివారం ఉదయం 9:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థీవదేహాన్ని ఏఐసీసీ కార్యాలయంలో ఉంచనున్నారు. ఉదయం 9:30కి ఏఐసీసీ కార్యాలయం నుంచి రాజ్‌ఘాట్ వరకు మన్మోహన్ అంతిమయాత్ర నిర్వహిస్తారు. అనంతరం రాజ్‌ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
Also Read
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతి దేశానికి తీరని లోటు అని అభివర్ణించారు. నిజాయితీ, సరళత, పార్లమెంటేరియన్‌గా విశిష్టమైన సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. మన్మోహన్ సింగ్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. మన్మోహన్‌కు నివాళులర్పించేందుకు కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మన్మోహన్ గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల రాష్ట్ర సంతాప దినాలను ప్రకటించింది. ఈ సంతాప దినాలు జనవరి 1, 2025 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో భారతదేశం అంతటా జాతీయ జెండాను సగం మాస్ట్‌లో ఎగురవేస్తారు. విదేశాలలో ఉన్న అన్ని భారతీయ మిషన్లు మరియు హైకమిషన్లలో అదే వ్యవధిలో జెండా సగం మాస్ట్‌లో ఎగురవేస్తారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!