టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇవాళ డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందనే వాదనతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. కేంద్రం పై విరుచుకుపడ్డారు. మోడీ ముందు ఈడీ వచ్చిందని ఎద్దేవ చేశారు.
తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం, పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్ షురూ చేస్తోంది.
చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్, పాదయాత్రలో అరెస్ట్ చేయడంపై అమిత్ సా ఆరాతీసారు. ఇవాళ బండి సంజయ్‌ను జనగాంలో అరెస్ట్ చేసి కరీంనగర్ లో ఆయన ఇంటికి తరలించిన పోలీసులు. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాలని డామాండ్ చేశారు. ఎక్కడ పాదయాత్ర ఆపారో, అక్కడి నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తా అని పేర్కొన్నారు. కూతురుకి…
ఆర్టీసీ నష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టి కాపాడుకుంటోందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి చెమట చుక్క విలువ తెలియని ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదని అన్నారు. కేంద్రం మాత్రం ఉన్న సంస్థల్ని అమ్ముకుంటోందని.. కార్మికులకు లాభం చేకూర్చే 40 చట్టాలను తీసేసి కేవలం నాలుగు కార్మిక చట్టాలను తెచ్చారని విమర్శించారు. కార్మికుల హక్కులను హరించే ఈ నాలుగు చట్టాలను తీసేసే వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్లకు బీజేపీ…
తెలంగాణలో ఇటీవల కాలంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ట్విట్టర్ వేదికగా ఎండగడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ వరసగా ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఇచ్చిన హామీలపై 8 ప్రశ్నాస్త్రాలు సంధించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ ఉంది మోడీ జీ? అంటూ ప్రశ్నించారు. దేశ జీడీపీ పడిపోతుంటే పెరిగిన…
తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని మండి పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బిజెపి…
రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ లక్ష్యంగా దాడి ముమ్మరం చేసేందుకు సిద్ధమైంది. శనివారం హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓవైపు టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పిస్తూనే.. మరోవైపు రాష్ట్రంలో బీజేపీకి మరింత సానుకూలత తెచ్చుకునేలా, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా షా ప్రసంగం ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే..…