తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపుతోంది. అయితే ఈ ఘటనపై ప్రధాని మోదీ నిర్ఘాంత పోయారు. మృతుల కుటుంబాలకు సానుభూతి, గాయపడిన వారితో ప్రార్థనలని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు అందజేయబడుతుందని తెలిపారు. గాయపడిన వారికి రూ. 50వేలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ట్విటర్ ద్యారా వెల్లడించారు. కాగా .. కామారెడ్డి రోడ్డు ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత…
ఇటీవల గాంధీభవన్లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతరావు, కవిత మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు బూతులు తిట్టుకున్నారు. అనంతరం సమావేశంలో నుంచి కవిత బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బహిర్గతం కావడంతో పార్టీ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని క్రమ శిక్షణ చర్యల కింద కవితను ఆమె పదవి నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ…
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్రం ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. కార్వాన్ నియోజకవర్గంలో నెలకొని ఉన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కంటోన్మెంట్లో చెక్ డ్యాం కట్టి నీళ్లు ఆపడంతో నదీం కాలనీ మునిగిపోతోందన్నారు.. ఇక, శాతం చెరువు నుంచి గోల్కొండ కిందకు ఏఎస్ఐ అనుమతి తీసుకొని నీళ్లు వదులుదామంటే అక్కడ ఏఎస్ఐ అనుమతి ఇవ్వడం లేదనన్ ఆయన. ఇలా కంటోన్మెంట్, ఏఎస్ఐ అభివృద్ధికి అడ్డు పడుతోందని…
సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈమధ్యకాలంలో ఆయన వత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైద్యపరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకెళ్ళారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేపడుతున్నారు. ఆయన వెంట భార్య, కూతురు కవిత, ఎంపీ సంతోష్ కుమార్ వున్నారు. ఉదయం 11గంటల 20 నిముషాల టైంలో కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఆస్పత్రికి వచ్చారని తెలుస్తోంది. సోమాజిగూడలో వున్న సీఎం కేసీఆర్ దగ్గరకు వెళ్ళారు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్. ఆస్పత్రి వద్ద…
దేశంలో రాజకీయాలను మార్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. అందులో భాగంగా కేసీఆర్ ఆదివారం ముంబై బయలుదేరి వెళ్ళారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్పవార్లతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ వెంట.. ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు జె.సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బి.బి పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ తదితరులు ఉన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ ముంబయి పర్యటన…
తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. మోదీ ఆధ్యాత్మిక పురుషుడు.కేసీఆర్ చాలా తప్పులు మాట్లాడారన్నారు. ఆయన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన కొడుకుని, కూతుర్ని దింపేయమనండి రాజ్యాంగం మారిపోద్ది. ఫ్యామిలీ పార్టీలకు చెక్ పెట్టేందుకు రాజ్యాంగం రాసుకుంటూ పోతున్నాం అన్నారు. ఫ్యామిలీ పార్టీ లను భారతదేశంలో ఉంచం. ఆంధ్ర రాష్టంలో మేము, మా మిత్రపక్షం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక చేస్తున్నాం. రెండు యూనిట్ ల…
కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందిచేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ మియాపూర్లో కల్వరి టెంపుల్ హాస్పిటల్ను ప్రారంభించారు కవిత. కోవిడ్ సమయంలో 200 పడకల కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన కల్వరీ టెంపుల్ సేవలను గుర్తించిన తెలంగాణ వైద్య శాఖ..శాశ్వతంగా 200 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి అనుమతిచ్చిందని చెప్పారు.
తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. ఈసందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను తీసుకున్నది సభ్యత్వ రసీదు కాదు. 15 మీటర్ల తాడు…ఈ తాడుతో తెలంగాణ అమరవీరుల స్థూపనికి కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావును కట్టేస్తా. అమర వీరుల తల్లిదండ్రులను పిలిచి కొరడాతో కొట్టిస్తా. ప్రపంచంలో అత్యంత మోసకారి కేసీఆర్. ప్రశ్నించే నాటికి నేను ఒక్కడినే. ఇప్పుడు చాలా గొంతుకలు ఉన్నాయి. తాడు తీసుకొచ్చేందుకే ఢిల్లీ వచ్చాను. నాపై 38 కేసులు పెట్టారు. ఏం సాధించారు. పోలీసులు…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఉన్నారు. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఏకగ్రీవమైనవారికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారులు అందజేస్తారు. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు.…