CM KCR Key Meeting: ఎల్లుండి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరగనుంది. ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో.. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ కార్యకలాపాలతో…
జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఆయన గతంలో కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లిన పాత ఫోటోలు బుధవారం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది.
టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇవాళ డిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉందనే వాదనతో ఆమె మీడియా ముందుకు వచ్చారు. కేంద్రం పై విరుచుకుపడ్డారు. మోడీ ముందు ఈడీ వచ్చిందని ఎద్దేవ చేశారు.
తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం, పోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్ షురూ చేస్తోంది.
చౌటుప్పల్ వరదలతో మునిగిపోతుంటే సిద్దిపేట సిరిసిల్లలో అభివృద్ధి చేస్తున్నారు దీనిని సమానత్వం అంటారా అని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. చౌటుప్పల్ మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపారు. కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని 23 వేల మంది వీఆర్ఏలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే కేసీఆర్ కు కళ్ళు మూసుకుపోయాయా? అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపి బండి సంజయ్ కు అమిత్ షా ఫోన్, పాదయాత్రలో అరెస్ట్ చేయడంపై అమిత్ సా ఆరాతీసారు. ఇవాళ బండి సంజయ్ను జనగాంలో అరెస్ట్ చేసి కరీంనగర్ లో ఆయన ఇంటికి తరలించిన పోలీసులు. ఈనేపథ్యంలో.. బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాలని డామాండ్ చేశారు. ఎక్కడ పాదయాత్ర ఆపారో, అక్కడి నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తా అని పేర్కొన్నారు. కూతురుకి…