Rudrudu Trailer: కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. లారెన్స్ అంటే.. టక్కున గుర్తొచ్చేవి దయ్యం సినిమాలే. ఆత్మలు.. తీరని కోరికలు.. ఆ కోరికలను తీర్చే హీరో.. ముని దగ్గర నుంచి మొన్నీమధ్య వచ్చిన గంగ వరకు అన్ని ఇలాంటి సినిమాలే తీసి హిట్లు అందుకున్నాడు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రుద్రుడు'. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల్ని 'ఠాగూర్' మధు సొంతం చేసుకున్నారు.