మూవీ క్రిటిక్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కత్తి మహేష్ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తల, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన స్వస్థలమైన పీలేరు వెళ్తుండగా నెల్లూరు హైవే చంద్రశేఖరపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల పెద్దగా గాయపడలేదు. కానీ కత్తికి మాత్రం బాగానే గాయపడ్డాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన కత్తిని…