మూవీ క్రిటిక్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కత్తి మహేష్ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో కత్తి మహేష్ తల, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన స్వస్థలమైన పీలేరు వెళ్తుండగా నెల్లూరు హైవే చంద్రశేఖరపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల పెద్దగా గాయపడలేదు. కానీ కత్తికి మాత్రం బాగానే గాయపడ్డాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే అపస్మారకస్థితిలోకి వెళ్లిన కత్తిని వెంటనే దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను చెన్నై లోని అపోలో ఆసుపత్రికి తరలించారు బంధువులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కత్తి ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ ఆయన గాయపడ్డ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా కత్తి మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన స్నేహితుడు సురేష్ ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ సిద్ధారెడ్డి అప్డేట్ ఇచ్చారు.
Read Also : న్యూ లుక్ లో మాస్ మహారాజ రవితేజ…!
రేపు మధ్యాహ్నం కార్నియోఫేషియల్ రికన్స్ట్రక్షన్ ఆపరేషన్ చేస్తున్నారు. ముందు ఆ ఆపరేషన్ కోసం బోన్ స్ట్రక్చర్ పునర్నిర్మించనున్నారు. ఆ తరువాత కంటి ఆపరేషన్ చేస్తారు. కత్తి మహేష్ కు కంటి చూపు సమస్య ఉండకపోవచ్చని నమ్మకంతో ఉన్నారు డాక్టర్స్.