ఏపీలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు వేసవి సెలవులను రద్దు చేస్తూ ప్రభుత్వం పనిచేయించుకుంటోంది. తాజాగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయులకు ఈ నెల 22 వరకు సెలవులు లేవని సమగ్ర శిక్ష అభియాన్ ప్రకటించింది. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాల పేరుతో టీచర్ల పనిదినాలను అధికారులు పొడిగించారు. విద్యార్థినుల ప్రవేశాల కోసం సిబ్బంది ప్రచారం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతేకాకుండా 100 శాతం ప్రవేశాలు సాధించాలని టీచర్లకు ఆదేశాలు…