జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ నియోజక వర్గాలను పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. జమ్మూలో 6, కాశ్మీర్‌లో 1 అసెంబ్లీ సిగ్మెంట్‌ను పెంచాలని పునర్విభజన సంఘం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలపై కాశ్మీర్ పార్టీలు భగ్గుమన్నాయి. జమ్మూలో 6 సిగ్మెంట్లు పెంచాలనే నిర్ణయం బీజేపీకి లబ్ది చేకూర్చే విధంగా ఉందని, జమ్మూలో బీజేపీ బలంగా ఉందని, ఆ పార్టీకి లబ్ది చేయడం కోసమే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారని మండిపడ్డారు. జమ్మూతో పాటుగా…
కశ్మీర్ లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా కశ్మీర్ ను చెప్పుకోవచ్చు. అలాంటి కశ్మీర్ లోని ప్రజల్లో చైతన్యం నింపడానికి ఓ ఆర్మీ అధికారి సంచనల వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్టన్ వెళ్లినప్పటి నుంచి కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎంతో మంది కశ్మీర్ పౌరులను ఉగ్రవాదులు…
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని ఈద్గాం సంగం పాఠశాలపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు టీచర్లు మృతి చెందారు. ఇద్దరు ఉపాధ్యాయులకు పాయింట్ బ్లాక్ లో కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన ఇద్దరు టీచర్లు సిక్కు, కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సతీందర్ కౌర్, దీపక్ చాంద్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు, ఆర్మీ సంఘటనా స్థాలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదుల కోసం…
శ్రీనగర్‌లో తొలిసారిగా ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 26 వ తేదీన శ్రీనగర్‌లో ఎయిర్‌షోను నిర్వహించనున్నారు. ఫ్రీఢమ్ ఫెస్టివల్ పేరుతో ఈ ఎయిర్‌షోను నిర్వహించనున్నారు. ఈ ఎయిర్‌షోకు మిగ్ 21, సుఖోయ్ 30 విమానాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదం కారణంగా నిత్యం తుపాకుల మొతతో దద్దరిల్లిపోయే శ్రీనగర్, దాల్ సరస్సులు ఇప్పుడు కొత్త తేజస్సును నింపుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తరువాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కాశ్మీర్‌లోని యువతను ఎయిర్‌ఫోర్స్, విమానయానరంగం…
కొన్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం కుదురుకోవటం పక్కా. అమెరికా , నాటో దళాలకు చెందిన ఆఖరు సైనికుడూ ఆఫ్గన్‌ని వీడాడు. ఇక వారికి ఎదురు లేదు. అయితే ఇది అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే తెలియదు. కానీ మన విషయం చూసుకుంటే కాశ్మీర్లో తాలిబాన్ల ప్రభావం ఉంటుందా అన్నది ప్రశ్న. కశ్మీర్ లోయకు తాలిబాన్లను మళ్లిస్తారా…లేదా అన్నది మరో పెద్ద క్వశ్చన్ మార్క్. ఒక వేళ అదే జరిగితే ఇప్పటికే…
తాలిబన్లు అంతే.. ఎప్పుడు ఏం మాట్లాడతారో.. ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితి.. తాజాగా, జమ్మూ కశ్మీర్ విషయంలో యూటర్న్ తీసుకున్నారు తాలిబన్లు.. మొదట్లో కశ్మీర్.. భారత్-పాకిస్థాన్ అంతర్గత విషయమని.. అది ఆ రెండు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పుకొచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మాట మార్చారు.. ముస్లింలుగా కశ్మీర్, భారత్ సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు మాకు ఉంది అంటూ ప్రకటించారు.. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్..…
కరుడు గట్టిన తాలిబన్ల తీరు మారుతుందా? ఇకనైనా పద్దతి మార్చుకుంటారా? మాటకు కట్టుబడి ఉంటారా! అలా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? చస్తే నమ్మరు. తాలిబన్ల ట్రాక్ రికార్డ్ అటువంటిది మరి. అందుకే ఆఫ్గనిస్తాన్ పొరుగు దేశాల్లో గుబులు మొదలైంది. ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే ఆ భయం లేదు. తాలిబాన్ అనే పాముకు పాలు పోసి పెంచింది అదే కదా! తాలిబన్ల విజయం చూసి పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. కానీ .. ఏదో ఒక రోజు దానిని కూడా…
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ…
జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎవరైతే రాళ్లు రువ్వుతారో, విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొంటారో వారికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేయాలని పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటుగా, దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యవహారాల్లో పాల్గొనే వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా చూడాలని, అలాంటి వారికి పాస్‌పోర్ట్ జారీ చేయకూడదని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాస్‌పోర్ట్, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి దృవీకరణ పత్రాల పరిశీలన సమయంలో వీటిని కూడా పరిశీలించాలని పోలీసు శాఖ…
జమ్ముకశ్మీర్‌లోని దేవాలయాలపై దాడులు చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్లాన్ చేశారా అంటే అవుననే అంటోంది ఇంటిలిజెన్స్ వ్యవస్థ. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆగస్టు 15 వ తేదీన ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించడంతో భద్రతాబలగాలు అప్రమత్తం అయ్యాయి. పాక్ ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు దాడులకు వ్యూహం పన్నాయని ఇంటిలిజెన్స్…