జమ్ముకశ్మీర్‌లోని దేవాలయాలపై దాడులు చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్లాన్ చేశారా అంటే అవుననే అంటోంది ఇంటిలిజెన్స్ వ్యవస్థ. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆగస్టు 15 వ తేదీన ఆలయాలను లక్ష్యంగా చేసుకొని పాక్ ఉగ్రవాద సంస్థలు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించడంతో భద్రతాబలగాలు అప్రమత్తం అయ్యాయి. పాక్ ఉగ్రవాద సంస్థలైన జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు దాడులకు వ్యూహం పన్నాయని ఇంటిలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. గూడాచార వర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రముఖ ఆలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూలోని ప్రసిద్ధ ఆలయం రఘునాథ్ ఆలయంపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
Read: అన్నతో పోల్చుకుంటూ… ‘వర్క్ ఇన్ ప్రొగ్రెస్’ అంటోన్న అల్లు శిరీష్!