కశ్మీర్ లో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతంగా కశ్మీర్ ను చెప్పుకోవచ్చు. అలాంటి కశ్మీర్ లోని ప్రజల్లో చైతన్యం నింపడానికి ఓ ఆర్మీ అధికారి సంచనల వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ థిల్లాన్ కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్టన్ వెళ్లినప్పటి నుంచి కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎంతో మంది కశ్మీర్ పౌరులను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారన్నారు.
అంతేకాకుండా కశ్మీర్ లోని ప్రజలు కొందరు తీవ్రవాద మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రజలు చైతన్యంతో మెలగాలని, వివిధ దేశాలలోని విమానాశ్రాయాలు వెళితే పాకిస్తాన్ అంటూ పిలవడం అపవాదుగా భావిస్తారన్నారు. అలాంటి గుర్తింపు తెచ్చుకోవడం కశ్మీర్ ప్రజలకు ఇష్టమా…? కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ లాంటి సమాజం కావాలనుకుంటున్నారా..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఉగ్రవాద సంస్థలకు కంటిమీదకునుకు లేకుండా చేసిన థిల్లాన్.. కీలకమైన సంఘటనల్లో ప్రత్యేక పాత్ర పోషించారు.