Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు.
పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న సంస్థ టీఆర్ఎఫ్ (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన తర్వాత పాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ అమెరికాను రెచ్చగొడుతుందంటూ తీవ్రంగా స్పందించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దాడికి సంబంధించి టీఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టిఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై పాకిస్తాన్‌లోని షాబాజ్ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేయడం ద్వారా స్పందించింది. Also Read:Hyderabad Rains : హోండా షోరూంలోకి…
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశవ్యాప్తంగా దుఃఖం, కోపం అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. ఉగ్రదాడుల్లో చురుకుగా పాల్గొంటున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను నిఘా సంస్థలు సిద్ధం చేశాయి. ఈ స్థానిక ఉగ్రవాదులు పాకిస్థాన్ ఉగ్రవాదులకు కీలక మద్దతుదారులుగా సంస్థలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదులకు మద్దతు, రవాణా సహాయం, ఉగ్రవాదులకు ఆశ్రయం, వనరులను సమకూరుస్తున్నారని తేల్చాయి. ఈ 14 మంది ఉగ్రవాదుల లిస్ట్‌ను జాతీయ మీడియా సంస్థ "ఆజ్ తక్" వెల్లడించింది. వారిని ఒక్కొక్కరిగా…
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై తీవ్రవాదులుగా భావిస్తున్న వారి దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు దాదాపు 28 మంది పర్యటకులు మరణించినట్లు తెలుస్తోంది. మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలలో దుండగులు ముస్లిమేతరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని దాడి చేశారని బాధితులు చెప్పడం కనిపించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు బయటకు వచ్చాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా,…
కశ్మీర్ భూమిపై మరోసారి భారతీయుల రక్తం చిందింది. సెలవుల్లో ఆహ్లాదంగా గడుపుదామని పహల్గామ్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృత్యుఒడికి చేరుకున్నారు. కొత్తగా పెళ్లయిన జంటల్లో భర్త కాటికి, భార్య సొంత గూటికి చేరుకున్నారు. ఇప్పటివరకు కాశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనిని పరిగణిస్తున్నారు. ఇందులో 28 మంది మరణించినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ విభాగం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.…