జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశవ్యాప్తంగా దుఃఖం, కోపం అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. ఉగ్రదాడుల్లో చురుకుగా పాల్గొంటున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను నిఘా సంస్థలు సిద్ధం చేశాయి. ఈ స్థానిక ఉగ్రవాదులు పాకిస్థాన్ ఉగ్రవాదులకు కీలక మద్దతుదారులుగా సంస్థలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదులకు మద్దతు, రవాణా సహాయం, ఉగ్రవాదులకు ఆశ్రయం, వనరులను సమకూరుస్తున్నారని తేల్చాయి. ఈ 14 మంది ఉగ్రవాదుల లిస్ట్‌ను జాతీయ మీడియా సంస్థ “ఆజ్ తక్” వెల్లడించింది. వారిని ఒక్కొక్కరిగా హతం చేయాలని భద్రతా దళాలు నిర్ణయించుకున్నాయి. వాళ్లను హతం చేయడానికి అన్నీ ప్లాన్స్ సిద్ధమయ్యాయి. ముందుగా.. ఈ ఉగ్రవాదులను ఒక్కొక్కరిగా భద్రతా దళాలు మట్టుబెడతాయి. వారి ఇళ్లను నేల మట్టం చేస్తారు. జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్ క్లీన్-అప్ లో భాగంగా ఏ ఉగ్రవాది కూడా తప్పించుకోలేరని భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.
READ MORE: Nabha Natesh : లేలేత సొగసుల నభా నటేష్.. కుర్రకారుని చేస్తుంది మటాష్
ఉగ్రవాదుల వివరాలు..
1) ఆదిల్ రెహమాన్..
ఆదిల్ రెహమాన్ లష్కరే తోయిబా (LeT) కు సోపోర్ కమాండర్. అతను 2021 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. వీడు సోపోర్‌లోని లష్కరే జిల్లా కమాండర్. దర్యాప్తు సంస్థలు వీడిపై నిఘా ఉంచాయి.
2) ఆసిఫ్ అహ్మద్ షేక్..
ఆసిఫ్ అహ్మద్ షేక్ జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) ఉగ్రవాది. అవంతిపుర జిల్లా కమాండర్. అతను 2022 నుంచి నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంటున్నాడు.
3) ఎహ్సాన్ అహ్మద్ షేక్..
ఎహ్సాన్ అహ్మద్ షేక్ లష్కరే తోయిబా ఉగ్రవాది. వీడు పుల్వామా దాడిలో చురుకుగా పాల్గొన్నాడు. 2023 నుంచి నిరంతరం ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు. భద్రతా సంస్థలు వీడిని త్వరలోనే హతం చేస్తారు.
4) హరీష్ నజీర్..
హరీష్ నజీర్ పుల్వామాకు చెందిన ఉగ్రవాది. అతను లష్కరే తోయిబాలో చురుకైన ఉగ్రవాది.
5) ఆమిర్ నజీర్ వాని..
ఆమిర్ నజీర్ వాని పుల్వామా దాడిలో చురుకైన ఉగ్రవాది. జైషే మహ్మద్‌తో సంబంధం ఉంది.
6) యావర్ అహ్మద్ భట్..
యావర్ అహ్మద్ భట్ పుల్వామాలో వ్యూహకర్తగా పని చేశాడు. జెఇఎం ఉగ్రవాది.
7) ఆసిఫ్ అహ్మద్..
ఆసిఫ్ అహ్మద్ కాండే షోపియన్‌కు చెందిన ఉగ్రవాది. జూలై 2015లో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. ప్రస్తుతం చురుకైన ఉగ్రవాదిగా పనిచేస్తున్నాడు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడు.
8) నసీర్ అహ్మద్ వాని..
నసీర్ అహ్మద్ వాని షోపియన్‌లో చురుకైన ఉగ్రవాది. లష్కరే తోయిబాతో సంబంధం ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నాడు.
9) షాహిద్ అహ్మద్ కుటే..
షాహిద్ అహ్మద్ కుటే షోపియన్‌లో మాత్రమే చురుకుగా ఉంటాడు. లష్కరే, టీఆర్ఎఫ్‌లలో పెద్ద ఉగ్రవాది. 2023 నుంచి చురుకుగా ఉన్నాడు.
10) ఆమిర్ అహ్మద్ దార్..
ఆమిర్ అహ్మద్ దార్ స్థానిక ఉగ్రవాది. 2023 నుంచి షోపియన్‌లో చురుకుగా పని చేస్తున్నాడు. లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ సహకారంతో పనిచేస్తున్నాడు. విదేశీ ఉగ్రవాదులకు మద్దతుదారుడు.
11) అద్నాన్ సఫీ దార్..
అద్నాన్ సఫీ దార్ షోపియన్ జిల్లాకు చెందిన చురుకైన ఉగ్రవాది. 2024లో ఒక ఉగ్రవాద సంస్థలో చేరాడు. లష్కరే తోయిబా, టీఆర్ఎఫ్ లతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ హ్యాండ్లర్ సమాచారాన్ని ఉగ్రవాదులకు అందజేస్తాడు.
12) జుబైర్ అహ్మద్ వాని..
జుబైర్ అహ్మద్ వాని అనంత్‌నాగ్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు ఆపరేషనల్ కమాండర్. చురుకైన A+ ఉగ్రవాది. ఉగ్రవాదులకు సహాయకుడిగా విస్తృతంగా పనిచేస్తాడు. భద్రతా దళాలపై జరిగిన దాడుల్లో వీడి పేరు చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ ఉగ్రవాది 2018 నుంచి చురుకుగా ఉన్నాడు.
13) హరూన్ రషీద్ ఘని..
హరూన్ రషీద్ ఘని అనంత్‌నాగ్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్‌లో చురుకైన ఉగ్రవాది. అతని కోసం భద్రతా దళాలు చాలా కాలంగా వెతుకుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం అతను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లి, అక్కడే శిక్షణ పొందాడు.
14) జుబైర్ అహ్మద్ ఘని..
జుబైర్ అహ్మద్ ఘని కుల్గాంకు చెందిన పెద్ద ఉగ్రవాది. లష్కరే తోయిబాలో ఉంటూ.. నిరంతరం భద్రతా దళాలపై దాడులు చేస్తుంటాడు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ తో కూడా సంబంధం కలిగి ఉన్నాడు.