కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఆ సంస్థ ఎండీ పార్థసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో ఆ సంస్థ ప్రతినిధులు బెయిల్ రాక ఇప్పటికీ జైళ్లలోనే ఉన్నారు. తాజాగా రజినీ అనే వాటాదారు కార్వీ ఆస్తులు అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌టీ (NCLT) విచారణ జరిపింది. Read Also: వాలంటీరే కాలయముడు.. కల్తీ కల్లు మరణాల కేసులో…
లక్షలాది మంది ఇన్వెస్టర్లను నట్టేటముంచిన కార్వి పార్థసారథిని.. బెంగళూరు పోలీసులు కస్టడీకీ తీసుకోనున్నారు. సెప్టెంబర్ 8న శేషాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో పార్థసారధిపై.. బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 109 కోట్ల రూపాయల ఫ్రాడ్ కేసులో పార్ధసారధి, కార్వీ సీఈఓ రాజీవ్ రంజన్, సిఎఫ్‌ఓ కృష్ణహరిపై కేసులు నమోదయ్యాయి.ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని బెంగుళూరు సీసీబీ పోలీసులు.. కోర్టును కోరారు. కస్టడీకి అనుమతించడంతో చంచల్ గూడ జైలు నుంచి నిందితులను…
కార్వీ ఎండీ పార్థసారథిని… చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు. పీటీ వారంట్ వేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు పార్థసారథిని కస్టడీకి అనుమతించింది కోర్టు. మరోవైపు ఇవాళ జైలులో ఈడీ విచారణ ముగిసింది. ఈడీ విచారణ ముగిసిన తర్వాతే పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. కాగా, కార్వీ కన్సల్టెన్సీ అక్రమాలను పాల్పడినట్టు అభియోగాలున్నాయి.. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టినట్లు నిర్ధారించారు. రూ.720 కోట్ల…