వివాహేతర సంబంధాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. పరాయి వారిపై ఉన్న మోజు కుటుంబాన్ని చంపేవరకు తీసుకెళ్తోంది. తాజాగా ఒక యువతి, ప్రియుడిపై ఉన్న మోజుతో కన్నతల్లిని కడతేర్చిన ఘటన కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని జిగని ప్రాంతానికి చెందిన అర్చన రెడ్డి అనే ఇద్దరు భర్తలతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు నవీన్ అనే జిమ్ ట్రైనర్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా సాగుతున్న క్రమంలో నవీన్ కన్ను అర్చన కూతురు యువిక మీద పడింది. ఆమెను కూడా తన మాయమాటలతో లొంగదీసుకుని ఇద్దరితో కామ క్రీడలు సాగించడం మొదలుపెట్టాడు. కొన్నిరోజులకు యువిక, నవీన్ ల బాగోతం తల్లి అర్చనకు తెలిసింది. దీంతో తన కూతురిని కలవడానికి వీల్లేదని నవీన్ కి పోలీసుల చేత వార్నింగ్ ఇప్పించింది.
ఇక ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన నవీన్, యువిక తో కలిసి తల్లిని చంపడానికి ప్లాన్ వేశాడు. తల్లి చనిపోతే ఆస్తి మొత్తం మన పేరుమీదకు వస్తుందని ఆమెను నమ్మించి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి అర్చనను హతమార్చారు. ఇక తల్లి కనిపించకపోయేసరికి మరో కూతురు, కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు యువిక, నవీన్ కలిసే అర్చనను హతమార్చినట్లు కనుగొన్నారు. ప్రస్తుతం వారందిరిని పోలీసులు అరెస్ట్ చేశారు.