కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి పీఠం ఎవరికి దక్కుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఈ సాయంత్రం తన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Karnataka : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హస్తం పార్టీ గెలుస్తుంది అనుకున్నారు కానీ ఇంత మెజార్టీ వస్తుందని ఎవరూ ఊహించలేదు.
Bengaluru City: భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా అర్బన్‌లో బలమైన ఓటు బ్యాంకు ఉంటుందని చెబుతారు.. కానీ, కొన్నిసార్లు అది తారుమారు అవుతుంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కీలంగా ఉన్న బెంగళూరు సిటీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది.. బెంగళూరు సిటీలో మొత్తం 32 నియోజకవర్గాలు ఉంటే.. అందులో 17 సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్.. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తే అంకేల్ సెగ్మెంట్‌ను బి.శివన్న 31 వేల 325 ఓట్ల ఆధిక్యంతో…
Mamata Banerjee: కర్ణాటకలో బీజేపీ దారుణంగా ఓడిపోవడంపై ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే.. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం, డీఎంకే స్టాలిన్ కాంగ్రెస్ నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సిద్ధరామయ్యలకు అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karnataka Election Results: సంప్రదాయంగా బీజేపీకి అండగా నిలుస్తున్న లింగాయత్ వర్గం ఈ సారి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ చివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించినా కూడా లింగాయల్ వర్గంలో ఉన్న అసంతృప్తిని అణచలేకపోయారు. ఫలితంగా బీజేపీకి గట్టి పట్టున్న స్థానాల్లో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా మెజారిటీ స్థానాలను కోల్పోవాల్సి వస్తుంది. తాజాగా ఈ రోజు వెలువడిన ఎన్నికల్లో ట్రెండ్స్ ను పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
Leaders' reaction to BJP's defeat: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం దిశగా సాగుతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ 113ని దాటి 137 స్థానాల్లో విజయం దాదాపుగా ఖరారు అయింది. బీజేపీ కేవలం 63 స్థానాలకు, జేడీఎస్ 20 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.