Bengaluru City: బెంగళూరు సిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.. అర్బన్‌లో బీజేపీ డీలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru City: భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా అర్బన్‌లో బలమైన ఓటు బ్యాంకు ఉంటుందని చెబుతారు.. కానీ, కొన్నిసార్లు అది తారుమారు అవుతుంది.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కీలంగా ఉన్న బెంగళూరు సిటీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకుంది.. బెంగళూరు సిటీలో మొత్తం 32 నియోజకవర్గాలు ఉంటే.. అందులో 17 సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్.. విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను చూస్తే అంకేల్ సెగ్మెంట్‌ను బి.శివన్న 31 వేల 325 ఓట్ల ఆధిక్యంతో కైవసం చేసుకున్నారు. బీటీఎం లేఅవుట్ స్థానంలో రామలింగారెడ్డి 9 వేల 222 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చామరాజ్‌పేటలో జమీర్ అహ్మద్‌ఖాన్ 53 వేల 953 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. గాంధీనగర్‌లో దినేష్ గుండూరావ్ కేవలం 105 ఓట్ల మెజార్టీతో బయటపడ్డారు. గోవిందరాజ నగర్‌లో ప్రియకృష్ణకు 12 వేల 516 ఓట్ల మెజార్టీ వచ్చింది. హెబ్బళ్‌లో బి.ఎస్ సురేష 30 వేల 754 మెజార్టీతో విజయం సాధించారు. జయనగర్ నుంచి సౌమ్య రెడ్డి కేవలం 294 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. సీఎం రేస్‌లో ఉన్న డీకే శివకుమార్ కనకపురలో లక్షా 22 వేల 392 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కునిగల్‌లో డాక్టర్ రంగనాథ్‌కు 26 వేల 573 ఓట్ల మెజార్టీ దక్కింది. మగదిలో హెచ్.సి. బాలకృష్ణకు 11 వేల 839 మెజార్టీ వచ్చింది. పులకేసి నగర్‌లో ఎ.సి.శ్రీనివాస 62 వేల 210 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రామ నగరంలో ఇక్బాల్ హుస్సేన్‌కు 10 వేల 715 ఓట్ల ఆధిక్యం దక్కితే, సర్వ నగర్‌లో కె.జె.జార్జ్‌కు 55 వేల 768 మెజార్టీ లభించింది. శాంతి నగర్‌లో ఎన్.ఎ.హారిస్ 7 వేల 125 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శివాజీ నగర్‌లో రిజ్వాన్ అర్షద్ 23 వేల 194 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విజయ నగర్‌లో ఎం.కృష్ణప్పకు 7 వేల 324 ఓట్ల మెజార్టీ దక్కింది.
ఇక, బెంగళూరు సిటీలో కమలనాథులు 14 సీట్లకే పరిమితయ్యారు. మూడు సెగ్మెంట్లలో 50వేలకు పైగా ఓట్ల మెజార్టీ దక్కింది. బెంగళూరు సౌత్‌లో ఎం.కృష్ణప్ప 49 వేల 699 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. బసవన్నగుడి స్థానాన్ని రవి సుబ్రహ్మణ్య 54వేల 978 ఓట్ల భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. బొమ్మనహళ్లి నుంచి ఎం. సతీష్ రెడ్డి 24 వేల 215 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సి.వి.రామనగర్‌లో ఎస్.రఘుకు 16 వేల 395 ఓట్ల మెజార్టీ దక్కింది. చిక్‌పెట్‌లో ఉదయ్ గరుదచర్ 12వేల 113 ఓట్లు, దసరహళ్లిలో మునిరాజ్ 9వేల 194 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కె.ఆర్.పురలో బి.ఎ.బసవరాజకు 24 వేల 301 ఓట్ల మెజార్టీ కట్టబెట్టారు ఓటర్లు. మహదేవపురలో ఎస్.మంజుల 44 వేల 501 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
మహాలక్ష్మి లేఅవుట్ సెగ్మెంట్‌లో కె.గోపాలయ్య 51 వేల 165 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. బొమ్మై కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన డాక్టర్ అశ్వత్ నారాయణ మల్లేశ్వరంలో 41 వేల 302 ఓట్ల ఆధిక్యం కనబర్చారు.పద్మనాభ నగర్‌లో ఆర్. అశోక 55 వేల 175 ఓట్ల భారీ మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ నగర్‌లో ఎస్.సురేష్ కుమార్‌కు 8 వేల 60 ఓట్ల ఆధిక్యం దక్కింది. రాజరాజేశ్వరి నగర్‌లో మునిరత్న 11వేల 842 ఓట్ల మెజార్టీ సాధించారు. యశ్వంత్‌పురలో ఎస్.టి.సోమశేఖర్ 15 వేల 118 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. మరోవైపు.. బెంగళూరు సిటీ చన్నపట్న నియోజకవర్గంలో పోటీచేసిన జేడీఎస్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేవలం 15 వేల 915 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీకి అడుగుపెడుతున్నారు. కుమారస్వామి చేతిలో బీజేపీ అభ్యర్థి యోగేశ్వర ఓడిపోయారు.
తాజావార్తలు
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్‌లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!