Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది.
DK Shivakumar: కర్ణాటక పీసీసీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీఎం సిద్ధరామయ్యతో ఉన్న విభేదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ఆశిస్తున్న డీకే, ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రంలో ప్రసంగిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో "రాజ్యాంగ సవాళ్లు" అనే శీర్షికతో AICC నిర్వహించిన కార్యక్రమంలో, గాంధీ కుటుంబాన్ని ప్రశంసించారు.
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్, ఉపముఖ్యమంత్రి అయిన డీకే శివకుమార్ వర్గాల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కి దక్కాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. ఇలాంటి ప్రతిపాదన ఏం లేదని సీఎం సిద్ధరామయ్య ఓపెన్‌గానే చెబుతున్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
Congress: ముఖ్యమంత్రి మార్పు, ఎమ్మెల్యేలు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరాయి. పరిస్థితి సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్‌గా మారింది. తర్వలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని కొందరు ఎమ్మెల్యేలు కామెంట్ చేస్తుంటే, మరికొందరు సిద్ధరామయ్యే మా సీఎం అని చెబుతున్నారు. దీంతో కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది.
కర్ణాటక కాంగ్రెస్‌లో టెన్షన్ ఊహాగానాల మధ్య ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయంలో క్రెడిట్‌పై చర్చ జరిగినట్లు సమాచారం. బహిరంగ ప్రకటనలు చేయవద్దని కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం తమ పార్టీ ఎమ్మెల్యేలను కోరినట్లు చెబుతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ సూచనలను పాటించాలని సూచించారు.
Kharge : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీ పథకాలను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఐదు రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీని గురించి గర్వంగా భావించి, దేశంలోని పురాతన పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునే మహారాష్ట్ర ఓటర్లకు ఐదు హామీలను ఇచ్చింది. అయితే, కర్ణాటకలో 5 హామీల పథకం కాంగ్రెస్‌కు ఖర్చుతో…
శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కర్ణాటక (Karnataka Congress) రాజకీయాలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా హీటెక్కాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రభుత్వం ఆరోపించింది.