Congress: కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రదాడులపై ప్రధాని నరేంద్రమోడీని విమర్శించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి సమయంలో కార్గిల్ యుద్ధ సమయంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీ చాలా మార్పు ఉందని అన్నారు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత నలుగురు సభ్యులతో కార్గిల్ సమీక్ష కమిటిని ఏర్పాటు చేయాలనే వాజ్‌పేయి నిర్ణయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రధానికిగా ఉన్న వాజ్‌పేయికి, ఇప్పుడు ఉన్న ప్రధాని మోడీ వేరు వేరు అని…
MiG-21: భారత వైమానిక దళం(IAF)లో 62 ఏళ్ల పాటు సేవలు అందించిన రష్యన్ తయారీ ఫైటర్ జెట్ MiG-21 రిటైర్ కాబోతోంది. చివరి జెట్‌ను సెప్టెంబర్ 19న చండీగఢ్ వైమానిక స్థావరంలోని 23 స్క్వాడ్రన్ (పాంథర్స్) నుంచి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. 1963లో వైమానిక దళంలో చేరిన మిగ్-21, 1965, 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధాల్లో, 1999 కార్గిల్ యుద్ధం, 2019లో బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సిందూర్‌లలో కీలక పాత్ర పోషించింది.
Kargil War: 1999లో భారత్‌పై పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదుల ముసుగులో కార్గిల్ యుద్ధానికి తెరలేపింది. అయితే, ఈ యుద్ధం జరిగి ఇప్పటికి 25 ఏళ్లు గడిచినా ఇందులో పాకిస్తాన్ ఆర్మీ తన ప్రేమేయం గురించి ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. ఈ యుద్ధం వెనక కర్త,కర్మ,క్రియ అంతా పాకిస్తాన్ ఆర్మీ అనేది బహిరంగ రహస్యమే అయినా, ఎప్పుడు కూడా తన పాత్రను అంగీకరించలేదు. ఇదిలా ఉంటే, తొలిసారిగా పాకిస్తాన్ ఈ యుద్ధంతో తమ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Lahore Declaration: భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి కోసం 1999లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు ‘‘లాహోర్ డిక్లరేషన్’’పై సంతకాలు చేశారు.
Vikram Batra: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి కమల్ కాంత్ బాత్రా(77) కన్నుమూశారు. ఆప్ మాజీ నేత అయిన కమల్ కాంత్ ఈ రోజు హిమాచల్ ప్రదేశ్‌లో మరణించారు. ఆమె మరణానికి హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఎక్స్‌లో తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘కెప్టెన్ విక్రమ్ బాత్రా తల్లి శ్రీమతి కమల్‌కాంత్ బత్రా మరణం గురించి విచారకరమైన వార్త తెలిసింది. మృతుల కుటుంబానికి అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని…
Nawaz Sharif: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N) అధినేత నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జరిగిన కార్గిల్ యుద్ధాన్ని ఉద్దేశించి ఆరోపణలు చేశారు. భారతదేశంతో సత్సంబంధాల ప్రాముఖ్యతను చెప్పినందుకు, కార్గిల్ ప్లాన్ వ్యతిరేకించినందుకు అప్పటి జనరల్ పర్వేజ్ ముషారప్ 1999లో తన ప్రభుత్వాన్ని దించేశారని శనివారం అన్నారు. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన తనను ముందస్తుగా ప్రధాని పదవి నుంచి ఎందుకు తప్పించారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం ద్రాస్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌ని సందర్శించి 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ ఒక ప్రదేశం మాత్రమే కాదన్న రాహుల్‌గాంధీ.. ఇది పరాక్రమమని అభివర్ణించారు.