బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తమ చిన్న కుమారుడికి పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని కరీనా తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు. మనవడి పేరు, ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ఫిబ్రవరి 2021లో తమ రెండవ కొడుకుకు స్వాగతం పలికిన కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అతనికి ‘జెహ్’ (Jeh) అని పేరు పెట్టారు. ‘జెహ్’ అనేది లాటిన్ పదం. దీని అర్థం “బ్లూ క్రెస్టెడ్ బర్డ్”.…