Pakistan: ప్రేక్షకులే లేకుండానే PSL మ్యాచ్‌లు.. పాకిస్తాన్ భయానికి కారణం ఇదే..
- పాకిస్తాన్‌ను వణికిస్తున్న తాలిబాన్లు..
- ప్రేక్షకులు లేకుండానే పీఎస్ఎల్ మ్యాచ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: అనవసరంగా ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబాన్లను పాకిస్తాన్ పెట్టుకుంది. ఇప్పుడు అనుభవిస్తోంది. తాలిబాన్లు పాకిస్తాన్‌కు దళాలకు చుక్కలు చూపెడుతున్నారు. పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్ సర్కార్ సహాయం చేస్తుందని చెబుతూ, పాక్ ఆ దేశ రాజధాని కాబూల్‌తో సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు చేసి, సాధారణ ప్రజల్ని హతమారుస్తోంది. ఈ నేపథ్యంలో తాలిబాన్ బలగాలు కూడా అంతే ధీటుగా పాక్‌పై విరుచుకుపడుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఈ ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్‌లపై పడింది. తాలిబాన్ దాడుల నేపథ్యంలో ఆదివారం నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు జరుగుతాయని తెలుస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు,ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్‌పై జరుగుతున్న నిరంతర దాడుల కారణంగా తలెత్తిన భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
PSL 2026 మార్చి 26న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సారి కేవలం రెండు నగరాల్లో మాత్రమే ఈ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి. కేవలం కరాచీ, లాహోర్‌లోనే మ్యాచులు నిర్వహించనున్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకు స్టేడియాలకు ప్రేక్షకుల్ని అనుమతించబోమని పీసీసీ ఛైర్మన్ మోహ్సీన్ నఖ్వీ విలేకరుల సమావేశంలో చెప్పారు. దీంతో పాటు పీఎస్ఎల్ ఓపెనింగ్ సెరమని కూడా జరగదని ఆయన స్పష్టం చేశారు.
“PSL మా అంతర్జాతీయ బ్రాండ్, ఇందులో అనేక మంది విదేశీ ఆటగాళ్లు పాల్గొంటారు. మేము ఈ టోర్నమెంట్‌ను రద్దు చేయలేము. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, 25,000 నుండి 30,000 మంది ప్రజలను స్టేడియాల్లోకి అనుమతించడం సాధ్యం కాదు.ఈ నిర్ణయం తీసుకునే ముందు, పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, భద్రతా సంస్థలతో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించాము” అని ఆయన వివరించారు. దేశ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు.
ఈ ఏడాది పీఎస్ఎల్ టోర్నీలో మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మార్చి 26 నుంచి మే 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. మొత్తం 8 జట్లు-హైదరాబాద్ కింగ్స్‌మెన్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి పిండిస్ జట్లు పాల్గొంటున్నాయి.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్‌టెల్‌లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్‌ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..