Pakistan Girl: పాకిస్థాన్ సమాజంలో మహిళలపై ఉన్న రూఢి సంస్కారాలు, వారి వస్త్రధారణ పట్ల చూపుతున్న అసహనం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో దీనికి బలమైన ఉదాహరణగా నిలిచింది. ఈ వీడియోలో, ఓ ముస్లిం యువతి జీన్స్, టాప్ వేసుకుని కరాచీ వీధుల్లో స్వేచ్ఛగా నడుస్తూ కనిపించగా, ఆమె వైపు చూసే విధానం మానవత్వాన్ని తాకట్టు పెట్టినట్టే ఉంది.
సాధారణంగా నగర వీధుల్లో నడవడం ఎవరికి అయినా సాధారణమే. కానీ ఈ అమ్మాయికి మాత్రం అదే ‘నేరంగా’ మారింది. వీడియోలో ఆమె ఎటు వెళ్లినా, చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను తారసపడేలా చూస్తున్నారు. కొన్ని చూపులు కుతూహలంగా, కొన్ని ఆశ్చర్యంగా, మరికొన్నీ అసభ్యంగా ఉన్నాయి. కేవలం జీన్స్-టాప్ వేసుకుందన్న కారణం చేత ఆమెపై అశ్లీల దృష్టితో చూస్తున్న తీరు కనిపిస్తోంది.
Sonali Bendre : క్యాన్సర్ నుండి కోలుకోవడానికి కారణం ఆ హీరో ఇచ్చిన ధైర్యం..
ఈ వీడియోను షేర్ చేసిన @effucktivehumor అనే సోషల్ మీడియా యూజర్ దీనిని ఒక “సోషల్ ఎక్స్‌పెరిమెంట్” అని చెబుతున్నారు. అమ్మాయి కరాచీలో పబ్లిక్‌లోకి వెళ్లి, ప్రజలు ఎలా స్పందిస్తారో పరీక్షించడం దీని ఉద్దేశం. దురదృష్టకరంగా, ఈ పరీక్షలో అనేకమంది తమ అసలైన వికృత మనస్తత్వాన్ని బయటపెట్టారు. వీడియోలో ఆమె పట్ల చూపిన విధానం పాకిస్థాన్ సమాజంలో నిగూఢంగా ఉన్న ‘మహిళలపై హక్కు’ భావనను బట్టబయలు చేశాయి.
ఈ వీడియోకు ఇప్పటికే 11 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. వేలాది మంది దీనిపై స్పందిస్తూ, పాకిస్థాన్‌లో మగవారిలో ఉన్న సమాజాన్ని హింసించే ఆలోచనాపద్ధతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాకిస్థాన్‌లో మహిళలను మనుషులుగా కాదు, ఆస్తిలా చూస్తారు” అనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. మరికొంతమంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అని పేర్కొన్నారు. ఒక అమ్మాయి ఏ వస్త్రధారణలో నడుస్తున్నదీ కాదు, ఆమెపై సమాజం చూపించే గౌరవమే అసలు అవసరం. సమాజం ముందు అద్దంలా నిలిచిన ఈ వీడియో, కనీసం కొన్ని మానసికత్వాల మార్పుకు చిగురుతెరలాలని ఆశించాల్సిందే.
Donlad Trump: ఏంటి ట్రంప్ మావా.. అప్పుడు బైడెన్ను ట్రోల్ చేశావ్.. మరి ఇప్పుడు నిన్ను ఏం చేయాలి..!
This is the reality of Karachi’s streets.
In this experimental video, a mvsIim girl wearing jeans and a top walked around the city to observe how many perverts she’d encounter. and the conclusion was: almost everyone.
Why is perversion so deeply rooted in Pakistani society? pic.twitter.com/fmPA44Jotw
— Mikku 🐼 (@effucktivehumor) June 7, 2025