Pak Nuclear Sites: పాకిస్తాన్ అణు నిల్వలు ఉంచిన ప్రదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి భూకంపం..?
- ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ను దెబ్బకొట్టిన భారత్..
- పాక్ లోని కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడి చేసినట్లు టాక్..
- పాక్ అణు నిల్వలు ఉంచిన ప్రదేశంలో ప్రతి 3 గంటలకు ఒకసారి భూకంపం..
- పాక్ అణు నిల్వలు ఉన్న ప్రదేశాల్లో జూన్ 1 నుంచి నేటి వరకు 19 సార్లు భూకంపాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Nuclear Sites: ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా పాక్ లోని అణు నిల్వలు ఉన్న కిరాణా హిల్స్ సమీపంలో భారత్ దాడులు చేసినట్లు సమాచారం. దీనిపై ఇప్పటి వరకు రెండు దేశాలు అధికారికంగా స్పందించినప్పటికీ.. అక్కడ జరిగిన దాడితో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని కరాచీ నివాసితులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి మూడు గంటలకు ఒకసారి స్వల్ప భూకంపం వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు 19 స్వల్ప భూకంపాలు సంభవించాయని వెల్లడించారు. అలాగే, ఈరోజు (మంగళవారం) ఉదయం 9:57 గంటలకు 2.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని అన్నారు. ఈ భూకంపాలు ముఖ్యంగా పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రి నిల్వలకు సమీపంలో ఉన్న మాలిర్, లాంధి, క్వాయిదాబాద్ వంటి ప్రాంతాల్లోనే సంభవిస్తున్నాయని వెల్లడించారు.
Read Also: Ambati Rambabu: సీఎం చంద్రబాబుకు కాపులు అంటే ఎందుకంత కోపం..?
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
కాగా, పాకిస్తాన్ వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ తెలిపిన వివరాల ప్రకారం.. లంధి ఫాల్ట్ లైన్ క్రియాశీలతే ఈ భూకంపాలకు ప్రధాన కారణం అన్నారు. ఇది ప్రస్తుతం విస్తృత పరిస్థితులకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు. ఈ ఫాల్ట్ లైన్‌లో పెద్ద భూకంపం రాలేదు.. ఇప్పుడు దానికి సంబంధించిన శక్తి నెమ్మదిగా బయటకు వస్తోందని పేర్కొన్నారు. దీని వల్ల చిన్న భూకంపాలు సంభవిస్తున్నాయని.. ఇవి భవిష్యత్తులో పెద్ద భూకంపాలుగా ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు. ఈ భూకంపాల కారణంగా ఎటువంటి పెద్ద నష్టం సంభవించదు.. కానీ, ప్రజల్లో భయాందోళనలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పారు. ఈ భూకంపాల పరంపర వచ్చే వారం వరకు కొనసాగవచ్చని వాతావరణ శాస్త్రవేత్త అమీర్ హైదర్ సూచించారు.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..