Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Waqf (Amendment) Act: వక్ఫ్(సవరణ)చట్టం-2025పై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 తీర్పు వెల్లడించనుంది. వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ స్టే కోరుతూ దాఖలపై పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం తన మధ్యంతర ఉత్తర్వులను ప్రకటిస్తుంది. మూడు ప్రధాన అంశాలపై మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తుంది. వీటిలో ‘‘వక్ఫ్ బై యూజర్’’, వక్ఫ్ బై కోర్ట్ ద్వారా వక్ఫ్ ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది. మూడు రోజలు పాటు రెండు వైపులా వాదనలు విన్న తర్వాత…
Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన "ఉదయ్‌పూర్ ఫైల్స్ - కన్హయ్య లాల్ టైలర్ మర్డర్" సినిమాకు న్యాయపరమైన చిక్కులు…
Shabbir Ali : వక్ఫ్ బోర్డు, మతపరమైన సంస్థల నిర్వహణ, సామాజిక న్యాయంతో సంబంధం ఉన్న అంశాలపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు , సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నుంచి తమ పిటిషన్లపై లభించిన సానుకూల తీర్పును స్వాగతించారు. ఈ తీర్పు తమకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, ప్రజల్లో న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచిందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తమ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పును ప్రశంసించారు. “జడ్జిలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కోర్టు…
వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో పది పిటిషన్లను ఈ రోజు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ముగ్గురుసభ్యుల ధర్మాసనం వాటిని విచారించింది. వక్ఫ్ చట్టరూపాన్ని ఆర్టికల్ 26 నిరోధించదని, ఆ రాజ్యాంగ నిబంధన సార్వత్రికమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Assam: అస్సాంపై సీనియర్ న్యాయవాది, రాజకీయ నాయకుడు కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ అస్సాం ఒకప్పుడు మయన్మార్‌లో అంతర్భాగం’’ అని వ్యాఖ్యానించారు.
చైనా తన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది.
Kapil Sibal: కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇతర ఎన్డీయేతర ప్రతిపక్షాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ ఎంపీ, మాజీ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సందేశం ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ప్రజల మనుసులు గెలుచుకోవాలని కాంగ్రెస్ కు సూచించారు.