కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టేడియంలో 36 గంటలకు పైగా పునీత్ భౌతికకాయం సందర్శన కొనసాగింది. ఈరోజు తెల్లవారుజాము వరకు భారీ సంఖ్యలో అభిమానుల తాకిడి ఉంది. రికార్డు స్థాయిలో 10 లక్షల మంది చివరి చూపు కోసం కంఠీరవ స్టేడియంకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. పునీత్ ను అడ్మిట్ చేసిన విక్రమ్ ఆసుపత్రి నుంచి ఖననం వరకు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. Read…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. కంఠీరవ స్టేడియం నుంచి రాజ్ కుమార్ స్టూడియా వరకు అంతిమయాత్ర కొనసాగగా భారీ సంఖ్యలో అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ అంక్షలు, రహదారిలో అడుగు అడుగునా పోలీసు బందోబస్తుతో ఈ అంతిమయాత్ర జరిగింది. ప్రస్తుతం రాజ్ కుమార్ స్టూడియో కు పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహం చేరుకుంది. అభిమానులు కూడా భారీగా స్టూడియో వద్దకు చేరుకుంటున్నారు. స్టూడియో వద్ద భారీగా బలగాలను…
అకాల మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఆయనకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలకడానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. నిన్న కర్ణాటక సీఎం బొమ్మై ఆసుపత్రిలోనే పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఈరోజు సినీ ఇండస్ట్రీ…
పునీత్ రాజ్‌కుమార్ మృతి దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈరోజు ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులో జరగనున్నాయి. ఎన్టీఆర్ బెంగళూరుకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియల కోసం అక్కడికి చేరుకోనున్నారు. ఎన్టీఆర్ పునీత్ రాజ్‌కుమార్‌కు చాలా సన్నిహితుడు. తారక్ ఈ కన్నడ స్టార్ కోసం ఒక పాట కూడా పాడాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మధ్య గొప్ప అనుబంధం ఉంది. పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమా…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మృతి కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న ఉదయం ఆయన గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ డాక్టర్ల ప్రయత్నాలు ఫలింకపోవడంతో పునీత్ తుదిశ్వాస విడిచారు. కర్ణాటక రాష్ట్రం ప్రస్తుతం తీవ్ర శోకసంద్రంలో ఉంది. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆమె కూతురు వచ్చాకే చేయనున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి అతని కుమార్తె వందిత తిరిగి వచ్చిన తర్వాత…