కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. కంఠీరవ స్టేడియం నుంచి రాజ్ కుమార్ స్టూడియా వరకు అంతిమయాత్ర కొనసాగగా భారీ సంఖ్యలో అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారు. నగరంలో ట్రాఫిక్ అంక్షలు, రహదారిలో అడుగు అడుగునా పోలీసు బందోబస్తుతో ఈ అంతిమయాత్ర జరిగింది. ప్రస్తుతం రాజ్ కుమార్ స్టూడియో కు పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహం చేరుకుంది. అభిమానులు కూడా భారీగా స్టూడియో వద్దకు చేరుకుంటున్నారు. స్టూడియో వద్ద భారీగా బలగాలను మోహరించారు. ప్రభుత్వ లాంఛనాలతో మరి కాసేపట్లో సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌరవ సూచకంగా మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరుపుతారు. పార్థవదేహం వద్ద ముఖ్యమంత్రి బొమ్మె కూడా ఉంటారు.
Read Also : ‘పుష్పక విమానం’ ట్రైలర్: లేచిపోయిన పెళ్లాన్ని వెతికే లెక్కల మాస్టర్ కథ