Uttarpradesh: డాక్టర్ లేడు.. స్ట్రెచర్ లేదు.. తండ్రిని చేతుల్లో మోసుకెళ్లిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు. ఈ సమయంలో బాధితుడికి ఆసుపత్రి నిర్వాహకులు ఎటువంటి స్ట్రెచర్ ఇవ్వలేదు లేదా అతనికి ఎటువంటి చికిత్స చేయలేదు. దీంతో నిరాశ చెందిన కొడుకు తండ్రిని ఒడిలోకి తీసుకుని వెళ్లిపోయాడు. పల్లెల్లో నిర్వహించిన తనిఖీల్లో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. త్వరలోనే జిల్లాలో ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడతాయన్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ట్విటర్లో ఆరోగ్య ఏర్పాట్లపై ప్రశ్నలను లేవనెత్తింది.
Read Also:ICID 25th Congress: విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు.. హాజరుకానున్న 90 దేశాల ప్రతినిధులు
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
అక్టోబరు 31న పట్టణంలో నివసించే పుష్పేంద్ర తన తండ్రిని శివలి సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఎలాగోలా డాక్టర్ క్యాబిన్‌కు చేరుకుని అక్కడ డాక్టర్ లేరని తెలిసింది. ఆపై నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. 6 నెలల క్రితం డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన మందలించారు. ఈ విషయంపై జిల్లాకు చెందిన ఏ వైద్యారోగ్యశాఖ అధికారి ఏమీ మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై ప్రశ్నలను లేవనెత్తిన కాంగ్రెస్, డిప్యూటీ సీఎంపై కూడా విరుచుకుపడింది.
Read Also:Hardik Pandya Injury Status: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. హార్దిక్ పాండ్యా ఆడడం కష్టమే!
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!