కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు కాస్త ఆలస్యంగా ఆరంభం కానుంది. వర్షం కారణంగా గ్రీన్ పార్క్ మైదానం తడిగా ఉండటంతో.. ఉదయం 9 గంటలకు పడాల్సిన టాస్ ఆలస్యమయింది. మైదానాన్ని పరిశీలించిన ఫీల్డ్ అంపైర్లు.. టాస్ 10 గంటలకు ఉంటుందని, మ్యాచ్ 10.30కు ప్రారంభమవుతుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కావాల్సింది. కాన్పూర్ టెస్టుకు వర్షం అంతరాయం కలిగించొచ్చని వాతావరణ శాఖ ముందే చెప్పింది. వర్షం…