వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తీసుకొచ్చారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వంశీకి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తీసుకొచ్చారు. వంశీ పోలీస్ కస్టడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ముందుగా కంకిపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సోమవారం ఉదయం కంకిపాడు నుంచి గుంటూరు జీజీహెచ్‌లో చేర్చారు. Also Read: Kandula Durgesh: ఏరోజూ సినిమా నిర్మాతల్ని…
ఫీజు కట్టలేదన్న కారణంగా శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం అర్ధరాత్రి ఓ విద్యార్థిని బయటికి పంపేసింది. విద్యార్థి తండ్రి రాత్రికి రాత్రే రూ.20,000 ఫీజు చెల్లించి.. తన కుమారుడిని లోపలి అనుమతించాలని కోరినా యాజమాన్యం కనికరించలేదు. దాంతో ఇక చేసేది లేక తండ్రి కొడుకులు ఇద్దరు అర్ధరాత్రి కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో చోటుచేసుకుంది. ఆబోతు గౌతమ్ అనే విద్యార్థి కంకిపాడు సమీపంలో శ్రీ చైతన్య…
కృష్ణా జిల్లా కంకిపాడులో కోడి పందాల శిబిరం దగ్గర ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. కంకిపాడులో చలువాది రాజా ఆధ్వర్యంలో కోడి పందాల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.. అక్కడ వణుకూరు - పునాదిపాడు కుర్రోళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. బీరు సీసాలతో కొందరు యువకులు వీరంగం సృష్టించారు.
ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభంమైంది.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా అంతా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.. ఇక, కంకిపాడులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల చేశారు.. ఇక, పనులు పూర్తి చేయడానికి డెడ్‌లైన్ పెట్టారు పవన్ కల్యాణ్.. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేసి.. జనవరి 25న మరికొన్ని పనులు ప్రారంబిద్ధామని సూచించారు.
అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం.. ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.. ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనుంది ప్రభుత్వం.. 3 వేల కిలో మీటర్ల…