Deputy CM Pawan Kalyan: ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభంమైంది.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ప్రజాప్రతినిధులు ఇలా అంతా ఆ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు.. ఇక, కంకిపాడులో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల చేశారు.. 91 లక్షలతో నిర్మించే 11 సిమెంటు రోడ్లకు.. 4.15 లక్షలతో రెండు గోకులాలుకు.. రెండు సిమెంటు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు.. ఇక, పనులు పూర్తి చేయడానికి డెడ్‌లైన్ పెట్టారు పవన్ కల్యాణ్.. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేసి.. జనవరి 25న మరికొన్ని పనులు ప్రారంబిద్ధామని సూచించారు.
Read Also: Malavika Mohanan : అందాలతో మతిపోగొడుతున్న ప్రభాస్ హీరోయిన్
ఆగస్టు 23న తెలిపిన పండుగకి ఇవాళ శంకుస్థాపన చేశాం.. ఒక పని పూర్తి చేయడానికి బలమైన అధికారుల అండ ఉండాలి.. 2024 ఎన్నికలకు కలిసి నిలబడి ఎన్నో ఎదుర్కొన్న, దెబ్బలు తిన్న, పోరాట స్ఫూర్తి వల్లే ఈ శంకుస్థాపనలు అన్నారు పవన్ కల్యాణ్.. ఒక అనుభవజ్ఞుడైన నాయకుడుగా చంద్రబాబు కావాలి అని జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయం సరైనది అన్నారు.. 5 సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వంలో పంచాయితీ రాజ్ శాఖమంత్రి ఎవరో తెలీలేదు.. పంచాయితీ రాజ్ శాఖ డబ్బులు ఎటెళ్లిపోయాయో గత ప్రభుత్వంలో తెలీలేదు అని విమర్శించారు.. మేం అన్నీ బహిర్గతం చేస్తున్నాం.. మేం చెబుతున్న పనులు ప్రజలు తీర్మానం చేసినవి.. గ్రామాలలో పనుల డిస్‌ప్లే బోర్డులు పెట్టారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ అన్నారు.. ఇక, ఒక IFS అధికారిపై కాకినాడలో విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఆదేశించాం.. ఇది లంచాల ప్రభుత్వం కాదని ప్రజలు అర్ధం చేసుకున్నారని వెల్లడించారు పవన్.
Read Also: Bengaluru North University: కాలేజీ పోర్టల్ హ్యాక్.. 60 మంది విద్యార్థుల మార్కులు తారుమారు
13,326 గ్రామ పంచాయితీలలో గ్రామ సభలు ఒకేరోజు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు పవన్.. గ్రామసభలలో చేసిన తీర్మానాలకు కావాల్సిన అనుమతులు ఇవ్వడం జరిగింది.. పరిపాలన ఎలా చేయాలి అనేదానికి నాకు స్ఫూర్తి సీఎం చంద్రబాబు అని వెల్లడించారు.. జాతీయ ఉపాధి హామీ పధకంలో పనిచేసే వారికి 15 రోజుల్లోపు మీకు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత.. 8100 రూపాయలు నెలకు ఇస్తాం.. నెల రోజుల్లోపు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి అన్నారు. కంకిపాడు-రొయ్యూరు వయా గూడవర్రు రోడ్డు నవీకరణ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్నా.. నిదురుమొండి నుంచీ బ్రహ్మయ్యగారి మూలం, నాగాయలంక వరకూ గ్రామాల ప్రజలు వరద బారిన పడ్డారని కలెక్టర్ తెలిపిన ప్రకారం రోడ్లు వేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు.
Read Also: WPI inflation : పండుగ సీజన్‌లో షాకిచ్చిన ద్రవ్యోల్బణం.. సెప్టెంబర్‌లో ఎంత పెరిగిందంటే ?
గుడివాడ నియోజకవర్గంలో నందివాడ గ్రామంలో నీటి అవసరాలు ఉన్నాయని ఎంఎల్ఏ తెలిపారు.. ఎంఎల్ఏలు గత ప్రభుత్వంలో తిట్ల పురాణం తప్ప మరేమీ చేయలేదు అని ఎద్దేవా చేశారు పవన్ కల్యాణ్.. 9 కోట్ల పని దినాలకు 4500 కోట్ల రూపాయల పనులు ఇవ్వడానికి తీర్మానం చేయడం దేశంలోనే మొదటిసారిగా అభివర్ణించారు. ఆమోదించిన పనులు అన్నిటికి జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులు ఇవ్వాలన్నారు. పంచాయితీరాజ్ గ్రామీణ శాఖకు సంబంధించి కేంద్రం ఇచ్చే డబ్బులున్నాయి.. అందుకే పవన్ కళ్యాణ్ దగ్గరే డబ్బులు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారని చమత్కరించారు.. సంక్రాంతి నాటికి అన్ని పనులు పూర్తి చేసి జనవరి 25న మరికొన్ని పనులు ప్రారంభిద్దాం.. కేన్సర్ ను ముందుగా గుర్తించడానికి తెచ్చిన మొబైల్ కేన్సర్ డిటెక్షన్ సెంటర్ ను ప్రారంభిస్తాం.. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ గురించి మోదీతో చర్చించి త్వరలోనే శుభవార్త అందిస్తాం.. కంకిపాడు కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్ధ పై పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..