Palle Panduga: గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శిస్తూ వచ్చిన కూటమి నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.. ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.. ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహిస్తారు.. రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభంకానున్నాయి.. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.. పల్లె పండుగలో భాగంగా దాదాపు రూ.4,500 కోట్ల వ్యయంతో 30 వేల పనులను చేపట్టనుంది ప్రభుత్వం.. 3 వేల కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, 500 కిలో మీటర్ల తారు రోడ్లు, వ్యవసాయ కుంటలు, పశువుల శాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాల వంటి పనులు చేపట్టబోతోంది కూటమి సర్కార్.
Read Also: Milkshake vs Fruit Juice: మిల్క్ షేక్ లేదా ఫ్రూట్ జ్యూస్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో జరిగే భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.. ఇక, సిమెంట్ కొనుగోలుకు సంబంధించి ఒక్కో బస్తా రూ.270 చొప్పున స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఆమోదించిన క్వారీల నుంచి సేకరించాలని స్పష్టం చేసింది.. ప్రతి రోడ్డు పని వద్ద వర్క్‌సైట్ బోర్డు ఏర్పాటు చేయాలని, దానిపై ఆయా పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలని సూచించింది. మొత్తంగా ఇవాళ్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు..
Read Also: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ హత్యకు మూడో ప్రయత్నం.? వ్యక్తి అరెస్ట్
మునుపెన్నడూ జరగని విధముగా గ్రామ పంచాయితీల అభివృద్ధి ‘పల్లె పండు’ కార్యక్రమం టార్గెట్ అంటుంది ప్రభుత్వం.. ఈ నెల 14 నుంచి 20 తేదీ వరకు జరిగే పంచాయితీ వారోత్సవాల్లో ఉపాధి హామీ నిధులతో.. ప్రగతికి అండగా 30,000 పనులు రూ.4,500 కోట్లు.. 8 లక్షల కుటుంబాలకు వంద రోజుల పని.. 3 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు.. 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 25000 గోకులాలు, 10 వేల ఎకరాలతో నీటి సంరక్షణ అని ప్రకటించింది కూటమి ప్రభుత్వం..